తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అత్యంత కీలక సమావేశం విశాఖపట్నం(Visakhapatnam)లో నిర్వహిస్తున్నారు.ఈ భేటీలో పలువురు ప్రముఖులు పాల్గొనన్నునారు,దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. నిర్మాతలు సి. కల్యాణ్, శ్రవంతి రవికిశోర్, భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. థియేటర్ల నిర్వహణ, సినిమా టికెట్లు(Movie tickets), పర్సంటేజీలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రాధాన్యత
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగానైనా కలిశారా ? అంటూ ప్రశ్నించారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు(Film celebrities) సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు బాలీవుడ్ తారల డ్యాన్స్ లతో సందడి