సీనియర్ నటుడు శివాజీ (Shivaji) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలి కాలంలో సినిమాలతో బిజీగా మారిన ఆయన, ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న ‘దండోరా’ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. నటుడు శివాజీ, థియేటర్లలో ఆహార పదార్థాల ధరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.థియేటర్లకు వెళితే ఐదుగురు సభ్యులున్న కుటుంబం 3000 నుంచి 5000 వరకు దోపిడీకి గురవుతోందని, టికెట్ ధరలతో పాటు తిండి,
Read Also: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?

ఎగ్జిబిషన్ రంగంలో మార్పులు చేయాలి
పానీయాల ధరలు కూడా విస్తుపోయేలా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. నటుడు శివాజీ (Shivaji) కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కాఫీకి రూ.350, కోక్‌కు రూ.400, పాప్‌కార్న్‌కు రూ.320, సమోసాలకు రూ.100 చెల్లించాల్సి వస్తోందని, అందుకే ప్రజలు ఓటీటీలకు వెళ్తున్నారని అన్నారు. మల్టీప్లెక్స్‌లను మద్యం దుకాణాలుగా మార్చి కమర్షియల్‌గా దండుకోవాలని చూస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ఎగ్జిబిషన్ రంగంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: