हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Shanthanu Bhagyaraj: ఉగ్రవాదులు భాష, ప్రాంతం చూడరు:శంతను భాగ్యరాజ్

Anusha
Shanthanu Bhagyaraj: ఉగ్రవాదులు భాష, ప్రాంతం చూడరు:శంతను భాగ్యరాజ్

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజ్ కుమారుడు, నటుడు శంతను భాగ్యరాజ్ దేశంలో నెలకొన్న భాషా, ప్రాంతీయ విభేదాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు దాడి చేసేటప్పుడు బాధితులు హిందీ, తెలుగు, కన్నడ లేదా తమిళం మాట్లాడేవారా అని అడగరని ఆయన గుర్తు చేశారు. మనం భారతీయులమనే విషయాన్ని గుర్తించి, ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.పహల్గాం ఉగ్రదాడి ఘటనపై శంతను తన ఎక్స్  ఖాతా ద్వారా స్పందించారు. “పహల్గామ్‌లో, మీరు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం వారా అని ఉగ్రవాదులు అడగలేదు. ఉత్తర భారతీయులా, దక్షిణ భారతీయులా అని కూడా పట్టించుకోలేదు. ఇక్కడ శత్రువు తన సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని పనిలో 90 శాతం మనమే ఉన్నాం, మనం సిగ్గు లేకుండా భాషలు, సరిహద్దుల గురించి పోట్లాడుకుంటున్నాం (లేదా పోట్లాడేలా చేయబడుతున్నాం)” అని శంతను తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

పుల్‌స్టాప్

మనమందరం భారతీయులమని గుర్తుంచుకోవాలని, ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “బుల్లెట్‌కు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని తెలియదు. ఇది కనువిప్పు కావాలి. ఒకరిపై ఒకరు ఈ అర్ధంలేని ద్వేషానికి, ప్రతికూలతకు ఇకనైనా పుల్‌స్టాప్ పెడదాం” అని శంతను అన్నారు.పహల్గాం దాడి వార్త వెలువడిన వెంటనే స్పందించిన తొలి సినీ ప్రముఖులలో శంతను ఒకరు. ఈ దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, బాధితుల కోసం ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదం ఎప్పటికీ ఆగదని, మనకు మనమే అండగా నిలవాలని, ఐక్యంగా ఉండాలని కోరారు. 

  Shanthanu Bhagyaraj: ఉగ్రవాదులు భాష, ప్రాంతం చూడరు:శంతను భాగ్యరాజ్

ముష్కరులు

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం రోజు మారణ హోమం సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.ఫుడ్‌స్టాల్స్‌ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

Read Also: Abir Gulaal Movie: అబీర్‌ గులాల్‌ మూవీ పై కేంద్రం బ్యాన్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870