Vairamuthu: భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు శనివారం (మార్చి 14) భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైరముత్తు పేరును ఖరారు చేసింది.
Read Also: Rajasekhar: నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!
నాలుగు దశాబ్దాల సాహితీ ప్రయాణం
వైరముత్తు, నాలుగు దశాబ్దాలుగా సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కవిత్వం, నవలలతో కలిపి ఆయన 37కు పైగా పుస్తకాలను రచించారు. ‘కళ్ళికాట్టు ఇతిహాసం’, ‘కరువాచ్చి కావియం’, ‘తన్నీ దేశం’ వంటివి ఆయన ప్రసిద్ధ రచనలలో కొన్ని. ఇక సినీ గీత రచయితగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక హిట్ గీతాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు.

వైరముత్తు తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. ఏడుసార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన రాసిన ‘కళ్ళికాట్టు ఇతిహాసం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: