हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Tamanna: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

Anusha
Tamanna: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు.దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని,త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి పీటలు

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెబుతారా అని మీడియా వేసిన ప్రశ్నకు ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా లవర్ విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో, ఇప్పట్లో ఆ ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చింది. ఇక ఇదే సమయంలో తమన్నా చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తెర తీసింది.

 Tamanna: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

కథనాలు

సరిగ్గా ఇదే సమయంలో తమన్నా సోషల్ మీడియాలో ప్రియుడి ఫొటోలను తొలగించింది. గతంలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసింది తమన్నా. అయితే వీరిద్దరు విడిపోయి చాలాకాలం అయిందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తమన్నా ఖాతాలో మరో బ్రేకప్ స్టోరీ చేరినట్టు అయింది. గతంలో పలుమార్లు ప్రేమాయణం సాగించిన తమన్నా, విజయ్ వర్మను వివాహం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతనికి కూడా అమ్మడు బ్రేకప్ చెప్పేసింది.

Read Also: Nani: మూవీ నెగిటివ్ రివ్యూల పై స్పందించిన నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870