కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan), టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన భారీ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’.పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి ప్రధాన పాత్రలు పోషించారు.టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
Read Also: Prabhas: మళ్లీ మారుతీతో రెబెల్ స్టార్ సినిమా.. ప్రభాస్ పీఆర్ టీమ్ క్లారిటీ

ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. 1960ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు.
శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం, అలాగే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది 100వ చిత్రం కావడం విశేషం. జయం రవి ప్రతినాయకుడిగా నటించగా, అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించారు.సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: