దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆకాశంలో ఒక తార’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్(ShrutiHaasan) ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకుంది.
Read Also:Suhas: ‘హే భగవాన్’ సినిమా టీజర్ విడుదల

భారీ నిర్మాణం, బహుభాషా విడుదల
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కథ, కథనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
2026 వేసవిలో థియేటర్లలోకి
‘ఆకాశంలో ఒక తార’ సినిమాను 2026 వేసవిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బహుభాషా(ShrutiHaasan) విడుదలతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: