ఇటీవల కాలంలో కుటుంబ ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షించిన వెబ్ సిరీస్‌లలో హార్ట్ బీట్ ఒకటిగా నిలిచింది. మెడికల్ డ్రామా నేపథ్యంలో సాగినప్పటికీ ఇందులో ప్రేమ, కుటుంబ అనుబంధాలు, తల్లీ కూతుళ్ల భావోద్వేగాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన విధానం ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది.
మొదటి సీజన్ 2024 మార్చి 8న ప్రారంభమై, దఫాల వారీగా ఆగస్టు 23 నాటికి 100 ఎపిసోడ్‌లు విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభమై నాలుగు ఎపిసోడ్‌లు విడుదలైన క్రమంలో, కథ మరింత ఊహించని మలుపులతో ముందుకు సాగుతోంది.

కథలో కొత్త మలుపులు – సంబంధాలలో చీకటి కోణాలు
రీనా (దీపా బాలు) వృత్తిపరంగా ముందుకు దూసుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమెకి దగ్గర కావడానికి అర్జున్ (చారుకేశ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అతని పట్ల ఆమె కోపం మాత్రం అంతే ఉంటుంది. ఇక తన భర్త ‘దేవ్’ ధోరణి ‘రతి’ (అనుమోల్)కి బాధ కలిగిస్తూ ఉంటుంది.
ఆమె జాబ్ మానేసి ఇంటిపట్టూనే ఉంటుంది. రీనాకి సంబంధించిన విషయం, ఆ భార్యాభర్తల మధ్య మరింత అగాధాన్ని సృష్టస్తుంది. తమ తల్లిదండ్రులు ఎప్పటిలా కలిసి ఉండేలా చేయడం కోసం వారి పిల్లలు దివ్య – సిద్ధూ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆర్కే హాస్పిటల్లో చక్రం తిప్పడానికి ట్రై చేసిన తేజు, ఉన్న ఉద్యోగం కాస్తా పోగొట్టుకుంటుంది. మరో చిన్న క్లినిక్ లో పనిచేస్తూ ఉంటుంది. అయితే తనకి జరిగిన అవమానానికి ఆమె మనసులోనే రగిలిపోతూ ఉంటుంది.
ఆమెతో కలిసి అర్జున్ ని దెబ్బతీయాలనుకున్న మదన్, అర్జున్ కారణంగానే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతాడు. రవి సీనియర్ ఫారిన్ వెళ్లడంతో అనిత సీనియర్ కి గుణ దగ్గరవుతాడు. వాళ్లిద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే ఇంటర్న్ గా ఆర్కే హాస్పిటల్లో కమలాసన్, కిరణ్, నీలోఫర్ జాయిన్ అవుతారు. రతి ప్లేస్ కి చీఫ్ డాక్టర్ గా ప్రీతమ్ వస్తాడు. కొత్తగా వచ్చిన కిరణ్, రీనాను చూడగానే మనసు పారేసుకుంటాడు.
సమయం దొరికితే చాలు, ఆమెకి దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిగతా స్టాఫ్ మాదిరిగానే, రతి తిరిగి వస్తే బాగుంటుందని రీనా భావిస్తుంది. ఆమె కోరిక నెరవేరుతుందా?
రతి తన భర్తకు చేరువవుతుందా? అర్జున్ – రీనా మధ్య స్పర్థలు తొలగిపోతాయా? తేజు ఏంచేయబోతోంది? అనేది మిగతా ఎపిసోడ్స్ లో తెలియనుంది.
విశ్లేషణ
దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఇతర ముఖ్యమైన పాత్రల మధ్య లవ్ ట్రాక్ వృత్తి పరమైన స్పర్థలు, అలకలు, కోపాలు ఆటపట్టించడాలు వంటి అంశాలతోనే ఈ సిరీస్ 100 ఎపిసోడ్స్ తో అలరించింది. కథలోని సమస్యలు అన్ని వైపుల నుంచి బలంగా ఉండటం వల్లనే, సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
గతంలో ఉన్న సమస్యలనే దర్శకుడు హైలైట్ చేస్తూ వెళుతున్నాడు. కథ-కథనాలు అదే ఫ్లోతో ముందుకు వెళుతున్నాయి. రాకీ పాత్ర ఎప్పటిలానే కామెడీ టచ్ తో అలరిస్తోంది. కాకపోతే రవి సీనియర్ లేని లోటు కనిపిస్తోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ‘నీలోఫర్’ పాత్రను హైలైట్ చేస్తారా? లేదంటే ‘తేజు’ పాత్ర వైపు నుంచి ఏదైనా కొత్త ట్రాక్ ను సెట్ చేస్తారా? అనేది చూడాలి. మొదటి సీజన్ మాదిరిగానే సెకండ్ సీజన్ కూడా అదే రేంజ్ లో అలరించే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.
సాంకేతిక నైపుణ్యం – నటీనటుల సహజత్వం
దర్శకుడు దీపక్ సుందర రాజన్ గత సీజన్‌లో చూపిన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ, ఈ సీజన్‌లో మరింత గంభీరంగా కథను మలచుతున్నారు. స్క్రీన్‌ప్లే తక్కువగానే ఉన్నా, పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలు, పరిణామాలు కథను బలంగా నిలబెడుతున్నాయి.
రాకీ పాత్ర ఎప్పటిలానే కామెడీ టచ్‌తో నవ్వులు పంచుతోంది. రవి సీనియర్ పాత్ర లేని లోటు కొద్దిగా అనిపించినా, కొత్తగా వచ్చిన నిలోఫర్ పాత్ర ద్వారా ఆ లోటు పూరించవచ్చేమో చూడాలి. తేజు పాత్ర మళ్లీ మలుపు తిప్పేలా అనిపిస్తోంది.
కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఈ కథకు గాఢతను తీసుకొచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా పాత్రల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త, సహజ నటన, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చిన తీరు ఇవన్నీ కలసి హార్ట్ బీట్ సిరీస్‌ను ఒక గుండెను తాకే ప్రయాణంగా మార్చాయి.
ఇంకా మిగిలిన ఎపిసోడ్‌లు వస్తేనే కథ అంతా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే, ఫస్ట్ సీజన్‌ను ప్రేమించిన ప్రేక్షకులు సెకండ్ సీజన్‌ను తప్పకుండా చూడడం ఖాయం.