हिन्दी | Epaper

Prithviraj Sukumaran: తన కొత్త సినిమాను ప్రకటించిన పృథ్వీరాజ్ సుకుమారన్

Anusha
Prithviraj Sukumaran: తన కొత్త సినిమాను ప్రకటించిన పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలితో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోయిజం సినిమాలు మాత్రమే కాకుండా, అద్భుతమైన నటనతో పాటు, సృజనాత్మకత, విభిన్నమైన కథలు, నూతన కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పృథ్వీరాజ్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. మలయాళీ చిత్రపరిశ్రమలో పృథ్వీరాజ్ సుకుమార్ టాప్ హీరో. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు పృథ్వీరాజ్. ఇటీవలే ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో నిజ జీవిత సంఘటనతో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 2019లో హైదరాబాద్‏లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా రూపొందించనున్న సినిమాలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్నారు.

మేఘనా గుల్జార్

ఈ సినిమాకు ధైరా అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కనిపించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏప్రిల్ 14న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దర్శకురాలు మేఘనా, పృథ్వీరాజ్ సుకుమార్, కరీనా కపూర్ కలిసి చర్చించుకుంటున్న ఫోటోస్ షేర్ చేశారు. అయితే ఈ సినిమాను నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

సమాచారం

తాజా నివేదికల ప్రకారం 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. 2019లో శంషాబాద్ ఏరియాలో ఓ అమ్మాయిని కొందరు యువకులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగానే ధైరా సినిమాను రూపొందించనున్నారని సమాచారం. డైరెక్టర్ మేఘనా కొన్నాళ్లుగా ఈ ఘటనపై పరిశోధనలు చేసిందని ప్రజలు, సమాజం గురించి ఆలోచించేలా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ పాత్రలకు లోతైన భావోద్వేగాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అలాగే ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Read Also: ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

📢 For Advertisement Booking: 98481 12870