हिन्दी | Epaper

Manchu Manoj: మంచు మనోజ్ కూతురి ఫ‌స్ట్ బ‌ర్త్‌డే పంచుకున్న పిక్స్

Anusha
Manchu Manoj: మంచు మనోజ్ కూతురి ఫ‌స్ట్ బ‌ర్త్‌డే పంచుకున్న పిక్స్

హీరో మంచు మనోజ్ తన కూతురు దేవసేన శోభా మొదటి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన భార్య మౌనికా రెడ్డి, పిల్లలతో కలిసి ఉన్న అందమైన ఫోటోలను పంచుకుంటూ, “మేము ముగ్గురం నలుగురం అయ్యాం” అంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని రాశారు.మనోజ్ కొన్నాళ్ల క్రితమే భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు గతేడాది పాప జన్మించింది. ఆ చిన్నారికి దేవసేన శోభా అని నామకరణం చేశారు. దేవసేన జన్మించి నేటికి సంవత్సరం కావడంతో కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

పుట్టినరోజు

మంచు మనోజ్ రెండేళ్ల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది పాప జన్మించింది తమ కూతురికి దేవసేన శోభా అని నామకరణం చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దేవసేన జన్మించిన నేటికి ఏడాది. ఈరోజు (ఏప్రిల్ 3న) దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో తన కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన కూతురి క్యూట్ ఫోటోస్ షేర్ చేశారు మంచు మనోజ్. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు మంచు మనోజ్.సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా తయారైంది. ముగ్గురం నలుగురు అయ్యాము. నాలుగు పిల్లర్లు, అందమైన ఫ్యామిలీ. దేవసేన నువ్వు మా జీవితంలోకి వెలుతురు, ధైర్యం, సంతోషాన్ని తీసుకొచ్చావు. అమ్మ, నేను ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీకు లైఫ్ లో అంతా బెస్ట్ ఉండాలి. మంచి జీవితాన్ని సృష్టించుకుందాం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పలేనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

మంచు లక్ష్మి సైతం దేవసేనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్యూ వీడియో షేర్ చేసింది. “నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను.కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్. నన్ను అత్తగా సెలక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ. నిన్ను త్వరలో ముంబైకి తీసుకెళ్లిపోతా. ఈ డైమండ్ ను నాకు ఇచ్చినందుకు మనోజ్, మౌనికకు థాంక్యూ” అంటూ రాసుకొచ్చింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

📢 For Advertisement Booking: 98481 12870