ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ‘గుంటూరు కారం’ చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు.అయితే నెక్ట్స్ జక్కన్న డైరెక్షన్ లో నటిస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 29 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియని పరిస్థితి. ఇక మహేశ్ బాబును మళ్లీ థియేటర్లలో చూడాలంటే అభిమానులు చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలోఅభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎస్ఎస్ఎంబీ29 కంటే ముందే థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మహేశ్ బాబు కెరీయర్ లోని హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’, అలాగే సూపర్ హిట్ ఫిల్మ్ ‘బిజినెస్ మ్యాన్’ చిత్రాలు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ల్లోనూ ఈ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి.
విడుదల
మరికొద్ది నెలల్లో మహేశ్ బాబు పుట్టిన రోజు ఉన్నందున ముందేగానే రీరిలీజ్ ల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మహేశ్ బాబు కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన 4 చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఆ రీరిలీజ్ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను కూడా ఫిక్స్ చేశారు. కాగా మొదట మహేశ్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ రీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయబోతున్నారు.అదే రోజు న ఏప్రిల్ 26ననే మహేశ్ బాబు మరో బ్లాక్ బాస్టర్ చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రం కూడా రీ రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇలా ఒకే రోజు రెండు చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ థియేటర్లలో దుమ్ములేపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రీ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు.

రీరిలీజ్
ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బాబు కెరీయర్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘అతడు’ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఏడాది మహేశ్ బాబు అభిమానులు బ్యాక్ టు బ్యాక్ రీరిలీజ్ లతో ఫుల్ ఎంటర్ టైన్ లభించనుంది. బాబును థియేటర్లలో చూసుకునే అవకాశం ఇలా దక్కడం విశేషం. ఇదిలా ఉంటే మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబీ29 చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. 3000 మంది ఆర్టిస్టులతో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట.
Read Also: Thaman: నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.౩౦ రూపాయలు: థమన్