ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకే పండగే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపాయి. సరికొత్త రికార్డులు సృష్టించాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సరికొత్త జానర్ లో వీరి సినిమా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) లైనప్ లో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashant Neel)దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ‘వార్ 2’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఇది ఆయనకు బాలీవుడ్ డెబ్యూ. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదే క్రమంలో కొరటాల శివతో ‘దేవర 2’ తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తారక్ త్వరలోనే ఓ బయోపిక్ లో నటించే అవకాశం ఉందని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

బయోపిక్
భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) సమర్పణలో నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని బాంబే మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా(Father of Indian Cinema) దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తారని అంటున్నారు. ఫైనల్ గా స్క్రిప్ట్ లాక్ అయిందని, ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ కు స్టోరీ నేరేషన్ ఇచ్చారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. దాదాసాహెబ్ ఫాల్కే కథ విని తారక్ ఆశ్చర్యపోయాడని, బిగ్ స్క్రీన్ మీద ‘భారత సినీ పితామహుడు’గా కనిపించడానికి ఆయన ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.భారతీయ సినిమా బయోపిక్ గా పేర్కొనబడుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీ ఇండియన్ సినిమా పుట్టుక, పెరుగుదలను వివరిస్తుందని తెలుస్తోంది. అసలు సినిమాలకు ఎక్కడ బీజం పడింది? ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనేది చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. కథ, కథనాలతో పాటు విజువల్స్ కు పెద్ద పీట వేస్తున్నారని అంటున్నారు.
Read Also: Movie: ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ మూవీ గ్లింప్స్ చూసారా?