‘Kannapa’ మూవీ ఫైనల్ కాపీ సిద్ధం – మోహన్ బాబు, విష్ణు సంతృప్తి వ్యక్తం
తెలుగు చిత్రసీమలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘Kannapa’ ఇప్పుడు తన విడుదలకు మరింత దగ్గరైంది. ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంచు మోహన్ బాబు, విష్ణు వీక్షించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ వద్ద బౌన్సర్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంలో మోహన్ బాబు, విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది. ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఇప్పటికే ఖరారైంది.
ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా విషయానికి వస్తే, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మాత్రమే మిగిలినవిగా తెలిపారు.
అనేక భాగాలు గ్రాఫిక్స్ ఆధారంగా ఉండే ఈ సినిమాలో, వీఎఫ్ఎక్స్ పనులు కీలకంగా నిలవనున్నాయి.
కానీ ఫైనల్ కాపీని చూసిన అనంతరం, సినిమా నాణ్యతపై మంచు కుటుంబం పూర్తిగా ధృవపడి ఉండటం చిత్ర బృందానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

విడుదలకు రెడీ అయిన ‘కన్నప్ప’ – ఈ నెల 27న థియేటర్లలోకి
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త. ఈ నెల 27వ తేదీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
సినిమా విడుదల ముహూర్తం ఖరారవడంతో, తాజా అప్‌డేట్స్‌తో చిత్రబృందం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ‘కన్నప్ప’ లో ప్రతీ భాగం ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధతో రూపొందించబడిందని ఇప్పటికే విష్ణు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
ఇప్పుడు విడుదల తేదీ సమీపించడంతో, ప్రమోషన్లు మరింత దూకుడుగా సాగుతున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ హాజరు..?
సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం త్వరలో జరగనుందని సమాచారం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరవుతారని టాక్ వినిపిస్తోంది.
ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో ప్రభాస్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ లాంటి ప్రముఖులు నటించినందున, వీరందరూ ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
అలాగే, ఈ గ్రాండ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం గ్రామంలో నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భీమవరం ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా, అక్కడే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారీ తారాగణంతో కన్నప్ప – పాన్ ఇండియా అంచనాలు
ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ ‘కన్నప్ప’గా కనిపించనున్నాడు. ఇతని పాత్రను చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యంతో చూపించనున్నారు.
అలాగే ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
ఇది కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించబడిన పాన్ ఇండియా మూవీ.
చారిత్రక ప్రస్థావనలతో కూడిన, ధార్మికతకు ఆధారంగా సాగే ఈ చిత్రం కన్నప్ప అనే భక్తుని గాథ ఆధారంగా తెరకెక్కించబడుతోంది.
ఇతని కథలోని త్యాగం, భక్తి, ధైర్యం వంటి విలువలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, మేకింగ్ గ్లింప్స్, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఫైనల్ స్టేజ్‌లో కన్నప్ప – థియేటర్లో కనివిని ఎరుగని విజువల్ ఫీస్ట్
ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీకి సంబంధించి VFX పనులు చివరి దశలో ఉన్నాయి. మూడ్, డెప్త్, థీమ్, చారిత్రక నేపథ్యానికి తగ్గట్టుగా ప్రతీ ఫ్రేమ్‌ను డిజైన్ చేస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
విభిన్నమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియస్ బ్యాక్‌డ్రాప్స్, అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో ఈ సినిమా ఓ విజువల్ స్పెక్టాకిల్‌గా మారనుంది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయిలో సినిమా ఉండేలా ప్రతి అంశాన్ని శ్రద్ధగా రూపొందించారు.
Read also: Gullak: టాప్ స్టార్స్ లేకపోయిన సంచలనం రేపుతున్న సినిమా ఓటీటీలోకి