కిశోర్,శ్రద్ధా శ్రీనాధ్, ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘కలియుగమ్-2064’ తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే 2064లో ఈ సినిమా కథ జరగబోతున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ఎలావుందో మీరు కూడా చూడండి.
ట్విస్టు
సామాజిక విలువలు ఎలా మారిపోతున్నాయి? మనిషి భావోద్వేగాలకన్నా మిషీన్లు ఎలా ప్రాధాన్యం పొందుతున్నాయి? భవిష్యత్తులో మనం ఎదుర్కొనాల్సిన సవాళ్లు ఏంటి? అన్న దానిపై ఈ సినిమా లోతైన విశ్లేషణ చేస్తుంది. ఈ క్రమంలో కథలో కొన్ని ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ‘కలియుగం-2064’ పేరు వినగానే దాని ప్రత్యేకత ఏమిటి అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. సినిమా చూస్తే అర్థమవుతుంది.
Read Also: Rajamouli : ఎస్ఎస్ఎమ్ బి సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!