हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Jatt: భారీ కలెక్షన్లు రాబట్టిన ‘జాట్’.. ఇప్పుడు ఓటీటీలోకి

Ramya
Jatt: భారీ కలెక్షన్లు రాబట్టిన ‘జాట్’.. ఇప్పుడు ఓటీటీలోకి

మాస్‌ ఆడియన్స్‌కు పండుగలా ‘జాట్‌’

ఈ ఏడాది ఊహించని స్థాయిలో విజయం సాధించిన మాస్ యాక్షన్ డ్రామాల్లో “జాట్‌” చిత్రం ముందుంటుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ హిందీ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. మాస్‌ సినిమాలకు ప్రాణం యాక్షన్ సీక్వెన్స్‌లే.

ఈ సినిమాలో ఉన్న భారీ ఫైట్ల డిజైన్, పవర్‌ఫుల్ హీరోఎంట్రీ, విలన్ కేరెక్టర్ ఫర్‌మెన్స్ అన్నీ కలిసి మాస్ ప్రేక్షకులకు పూనకాలే కాదు, థియేటర్లలో (whistles) రప్పించాయి. అసలే బాలీవుడ్ మూవీ అయినా, కథ అంతా ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో సాగడం, అన్ని పాత్రలూ మన తెలుగువారే పోషించడం సినిమాకు సత్తా చాటే అంశంగా నిలిచింది.

శ్రీలంక నుంచి మోతుపల్లి వరకు ఒక నేర సామ్రాజ్యం

కథ అంతా ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో సాగుతుంది. శ్రీలంకలో‌ బోల్డంత బంగారాన్ని చోరీ చేసిన ఒక కరడుగట్టిన క్రిమినల్ ఆంధ్ర ప్రదేశ్ సముద్ర తీరానికి వస్తాడు. చీరాలలోని మోతుపల్లి వేదికగా తన నేర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.

పెద్ద పెద్ద పోలీసాఫీసర్లు కూడా ఆ క్రిమినల్ ను టచ్ చేయడానికి భయపడతారు. అలాంటి సమయంలో ఒక లేడీ ఎస్సై తన ఫిమేల్ కానిస్టేబుల్స్ తో కలిసి మోతుపల్లి వెళుతుంది. కానీ వీరందరిని లైంగికంగా వేధించడంతో పాటు ఇంట్లో బంధిస్తారు.

అదే సమయంలో అనుకోకుండా హీరో అక్కడ దిగుతాడు. అతను టిఫిన్ చేస్తుండగా కొందరు లోకల్ గూండాలకు గొడవ దిగుతారు. ‌ అక్కడి నుంచి చిన్నగా మొదలైన గొడవ ఏకంగా ఆ హార్డ్ కోర్ క్రిమినల్ దగ్గరకు వెళ్లి ఆగుతుంది.

అయితే హీరోతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక సారీ చెబుతాడు సదరు క్రిమినల్. కానీ హీరో మాత్రం అక్కడ ఏదో తేడా జరుగుతుందని తెలుసుకుంటాడు. అక్కడి గూండాలను చితక్కొట్టి ఇంట్లో బంధించిన లేడీ పోలీసులను బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Jatt: భారీ కలెక్షన్లు రాబట్టిన 'జాట్'.. ఇప్పుడు ఓటీటీలోకి
Jatt Movie

తెలుగు టాలెంట్ తో తళుక్కుమన్న హిందీ సినిమా

“జాట్” అనే పేరు వినగానే పంజాబీ నేపథ్యంలోనే ఉంటుందని అనుకునే వీలుంటుంది. కానీ ఇది పూర్తిగా తెలుగుతనంతో నిండిన సినిమా. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరపై చూపించిన మసాలా బ్లెండింగ్ ప్రేక్షకులను థ్రిల్ లో ముంచెత్తింది.

నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, ఇటీవలి బ్లాక్ బస్టర్ “పుష్ప 2” తర్వాత మళ్లీ మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకొని ఈ సినిమాను తీర్చిదిద్దారు. సన్నీ డియోల్ మళ్లీ ఒకసారి తన యాక్షన్ హవాను చూపించాడు. రణ్‌దీప్ హుడా విలన్ పాత్రలో మేచిపోయే నటన చేశాడు.

రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, జగపతి బాబు, రమ్య కృష్ణ, పృథ్వీరాజ్ వంటి వాళ్లతో సినిమా క్యాస్టింగ్ హైలైట్‌గా నిలిచింది. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఓ స్పెషల్ మాస్ ఎనర్జీ జతచేసింది. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సీన్ లకు పవర్‌ను తీసుకువచ్చాయి.

ఓటీటీలో రానున్న మాస్ ఫెస్ట్‌

థియేటర్‌లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న “జాట్‌” సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమాను చూసే అవకాశం లభించబోతోంది. మిస్ అయినవాళ్లు ఇక దానిని ఇంట్లోనే లైవ్‌గా ఆస్వాదించొచ్చు. థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోయినా, ఇప్పుడు మీ హోమ్ స్క్రీన్‌పై ఆ మాస్ యాక్షన్ పండుగను ఆస్వాదించండి.

Read also: Ustaad Bhagat Singh: ప‌వ‌న్‌ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’పై క్రేజీ అప్‌డేట్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870