हिन्दी | Epaper

Pooja Hegde: నేను గ్యాప్ తీసుకోలేదు వచ్చింది: పూజా హెగ్డే

Anusha
Pooja Hegde: నేను గ్యాప్ తీసుకోలేదు వచ్చింది: పూజా హెగ్డే

టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే, తన చక్కని అందంతోనే కాదు నటనతోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి.దాదాపు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన పూజా హెగ్డేకి ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ ఆఫ‌ర్సే లేవు. పూజా తెలుగులో సినిమా చేయ‌క మూడేళ్లు అవుతుంది. ముఖ్యంగా అల వైకుంఠపురములో, అరవింద సమేత, ముకుందా, దువ్వాడ జగన్నాధం వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. అయితే, ఇటీవల హిందీలో అవకాశాలు రావడంతో పూజా అక్కడే బిజీ అయ్యింది.పూజా న‌టించిన అరవిందసమేత వీరరాఘవ, మహర్షి లాంటి చిత్రాలు హిట్స్ కావ‌డంతో పూజా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారింది.

రెట్రో సినిమా

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజా హెగ్డేకి ఒక్క హిట్ రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య నిరాశ పరచగా డబ్బింగ్ మూవీ బీస్ట్ తో పాటు హిందీ సినిమాలు సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు మే 1న రిలీజ్ కాబోతున్న సూర్య రెట్రో సినిమాపై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది. పూజా రెట్రో చిత్రంతో పాటు విజయ్‌తో `జన నాయగన్‌` చిత్రంలో నటిస్తుంది. `కాంచన 4`లోనూ న‌టిస్తుంది. మరోవైపు `కూలీ`లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. అలాగే ఓ హిందీ మూవీలో కూడా న‌టిస్తుంది. ఇప్పుడు పూజా చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయితే మే 1 రిలీజ్ కాబోతున్న రెట్రో మీద చాలా ఆశలు పెట్టేసుకుంది.

 Pooja Hegde: నేను గ్యాప్ తీసుకోలేదు వచ్చింది: పూజా హెగ్డే

కనెక్ట్ కాలేదు

టీమ్ లో అందరికంటే ముందుగా తెలుగు ప్రమోషన్లు మొదలుపెట్టింది బుట్ట‌బొమ్మ‌. ఈ క్ర‌మంలో పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో ఎప్పుడు సినిమా చేయబోతున్నార‌న్న ప్ర‌శ్న ఎదురైంది. దానికి స‌మాధానంగా అల వైకుంఠపురములో సినిమాలో చెప్పినట్లుగా నేను గ్యాప్ తీసుకోలేదు వచ్చింది. నేను ఏదైనా డిఫరెంట్ గా, కొత్తగా చేయాలని అనుకుంటున్నా. చాలా కథలు విన్నాను కానీ ఇప్పటివరకూ నాకు ఏదీ అంత‌గా కనెక్ట్ కాలేదు. ఈసారి నేను చేసే సినిమా తప్పకుండా బాగుండాలని, వైవిధ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొంది. అయితే త్వ‌ర‌లో పూజా ప్రేమ క‌థా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని, హైదరాబాద్ ని సొంత‌ ఇల్లులా ఫీలవుతానని కూడా చెప్పుకొచ్చింది. మూడేళ్ల త‌ర్వాత పూజా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంద‌ని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

Read Also: Manoj Bajpayee: స‌త్య మూవీ కి మ‌నోజ్ బాజ్‌పాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

📢 For Advertisement Booking: 98481 12870