हिन्दी | Epaper

‘Hey Balwant’ movie review: ‘హే బల్‌వంత్‌’ సినిమా ఎలా ఉందంటే!

Anusha
‘Hey Balwant’ movie review: ‘హే బల్‌వంత్‌’ సినిమా ఎలా ఉందంటే!

‘Hey Balwant’ movie review: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాల తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్’. సెన్సార్ అభ్యంతరాల వల్ల ‘హే భగవాన్’ నుంచి పేరు మార్చుకున్న ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలోకి వచ్చింది.  ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమాతో సుహాస్‌ విజయం దక్కిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

Read Also: Rajamouli-Mahesh Babu: వారణాసిలో కిచ్చా సుదీప్?

కథ:

కృష్ణ (సుహాస్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నపటి నుంచి తండ్రి చేసే బిజినెస్ టేకోవర్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. మరోవైపు కృష్ణ తండ్రి రావు బల్వంత్ (వి.కె. నరేష్) లాడ్జి నడుపుతుంటాడు. ఓసారి కృష్ణ తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దాంతో డాక్టర్ బిజినెస్ టెన్షన్స్ కు దూరంగా ఉండమంటాడు. దాంతో తండ్రి చేసేది ఆ బిజినెస్‌ అని తెలియక ఎలాగైనా తన చేతుల్లోకి తీసుకుని, లాభాల బాట పట్టించాలని కృష్ణ నడుంబిగిస్తాడు. కానీ తీరా ఆ బాధ్యతలు తీసుకోడానికి అక్కడికి వెళ్లిన కృష్ణ.. అది లాడ్జ్ అని తెలిసి షాక్ అవుతాడు. ఈ గొడవల్లో మిత్ర (శివానీ నాగారం) పాత్ర ఏంటి..? అసలు ఎలాంటి పరిస్థితుల్లో రావు బల్వంత్ ఆ వ్యాపారం మొదలు పెట్టాడు అనేది మిగతా కథ.

'Hey Balwant' movie review: How is the movie 'Hey Balwant'?
‘Hey Balwant’ movie review: How is the movie ‘Hey Balwant’?

కథనం

ఒక రిస్కీ లైన్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది.. కానీ ఏదైనా తేడా జరిగితే డేంజర్ జోన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. హే బల్వంత్ సినిమా ఈ రెండింటి మధ్య బాగా బ్యాలెన్స్ అయింది.. ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనేది ఫస్ట్ 2 మినిట్స్ లోనే క్లారిటీ ఇచ్చేసాడు డైరెక్టర్. అక్కడ స్టోరీకి సింక్ అయితే సినిమా అంతా ట్రావెల్ అవ్వచ్చు. అప్పుడు డిస్కనెక్ట్ అయితే సినిమాను ఎంజాయ్ చేయడం కష్టం.బిజినెస్ బిజినెస్ అంటూ టీజర్, ట్రైలర్లో హైప్ బాగా పెంచారు మేకర్స్. అదేంటో తెలిశాక.. దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా వర్క్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ హిలేరియస్.. ఎక్కడ చిన్న బ్రేక్ కూడా ఇవ్వలేదు. నాన్ స్టాప్ పంచులతో వెళ్లిపోయింది సినిమా.. మరీ ముఖ్యంగా సుదర్శన్ కామెడీ పీక్స్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870