Hansika Motwani : టాలీవుడ్ ‘దేశముదురు’ భామ హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. తన భర్త సోహైల్ కతూరియాతో నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణం విడాకులతో ముగిసిందని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజా పరిణామాలు ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also :Peddi Movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్

‘చార్దీ కలా’ అంటూ హన్సిక పోస్ట్..
విడాకుల ప్రక్రియ అనంతరం హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో ‘చార్దీ కలా’ (Chardi Kala) అనే పంజాబీ పదాన్ని పోస్ట్ చేశారు. దీనికి అర్థం “ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలతో, అచంచలమైన ఉత్సాహంతో ముందుకు సాగడం”. కష్ట కాలంలో కూడా ఆశావాద దృక్పథంతో ఉండాలని ఆమె ఈ పోస్ట్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.
అప్పట్లో ఘనంగా పెళ్లి.. ఇప్పుడు విడాకులు!
హన్సిక, సోహైల్ కతూరియా వివాహం 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ముండోటా కోటలో అత్యంత వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకలను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డిస్నీ+ హాట్‌స్టార్‌లో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే గతేడాది ఆగస్టులోనే హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :