हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Gymkhana Movie:‘జింఖానా’ మూవీ ట్రైల‌ర్ విడుదల

Anusha
Gymkhana Movie:‘జింఖానా’ మూవీ ట్రైల‌ర్ విడుదల

మలయాళ యంగ్ హీరో నస్లెన్ కె. గఫూర్ ‘ప్రేమలు’ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో మరో యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా ‘జింఖానా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ మలయాళ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. వారంలోనే దేశవ్యాప్తంగా రూ. 27 కోట్లు మార్క్ దాటింది.

ట్రైలర్

అయితే సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో తెలుగులో కూడా డబ్ చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కథ బాక్సింగ్ శిక్షణలో చేరే యువకుల చుట్టూ తిరుగుతుంది. సరదాగా బాక్సింగ్ శిక్షణలో చేరిన వారికి ఆ ఆట పట్ల తీవ్రమైన అభిరుచి పెరగడానికి కారణమేంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.  ఫన్నీ డైలాగ్‌లు, యువత వైబ్స్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు.నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షోన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ , నోయిలా ఫ్రాన్సీ,  షైన్ టామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

ఎంటర్‌టైన్‌మెంట్

ట్రైలర్ మొత్తం వైబ్ – ఫన్ , ఫైట్ లతో అడిరిపోయింది. కొంతమంది యువకులు బాక్సింగ్ క్లాస్ కోసం సైన్ అప్ చేస్తారు, ఇదంతా సరదా , ఆటలు అని భావిస్తారు.శిక్షణ ప్రారంభమైన కొద్దీ జీవిత పాఠాలు తెరపైకి వస్తాయి. బాక్సింగ్ అంటే పంచ్‌లు విసరడం మాత్రమే కాదని – ఇది క్రమశిక్షణ, విల్ పవర్ అని తెలుసుకుంటారు. వారిలో నిజంగా ఫైర్ మొదలవుతుంది? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.దర్శకుడు ఖలీద్ రెహమాన్ హ్యుమర్, సోల్, ఎక్సయిట్మెంట్, హై ఎనర్జీతో కూడిన పోరాట సన్నివేశాలను మిక్స్ చేసి, దీనిని అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా రూపొందించారు. నస్లెన్ తన చార్మ్ తో గ్యాంగ్ ని నడిపిస్తాడు.ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు.జిమ్షి ఖలీద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ తో ఈ చిత్రం ఒక విజువల్ ట్రీట్ అందిస్తుంది. ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలని పెంచింది.

Read Also: ILayaraja: షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్‌ లో పాల్గొన్న ఇళయరాజా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870