हिन्दी | Epaper

Falaknuma Das: ఏప్రిల్ 10న ఫలక్‌నుమా దాస్ రీ రిలీజ్

Anusha
Falaknuma Das: ఏప్రిల్ 10న ఫలక్‌నుమా దాస్ రీ రిలీజ్

టాలీవుడ్‌లో తనదైన స్టైల్, మాస్ అప్పీల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్ సేన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం “ఫలక్‌నుమా దాస్” మళ్లీ రీ-రిలీజ్‌కి సిద్ధమైంది. హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ అయిన ఈ చిత్రం 2019లో విడుదలై విశేషమైన విజయం సాధించింది. దీంతో విశ్వక్ సేన్‌ని అందరు “మాస్ కా దాస్”అంటుంటారు.ఇప్పుడు, దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత, ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ నిర్ణయించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఏప్రిల్ 10న “ఫలక్‌నుమా దాస్” గ్రాండ్ రీ-రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు.

క‌థ

ఫలక్‌నుమా ప్రాంతంలోని దాస్ (విశ్వక్ సేన్) అనే యువకుడి లైఫ్ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది. దాస్ చిన్ననాటి నుంచే అత‌డి ఏరియాలో ఉన్న లోక‌ల్ దాదా శంకర్‌(జీవ‌న్‌)ను చూసి ఆదర్శంగా తీసుకుని అత‌డిలా అవ్వాలి అనుకుంటాడు. బాల్యంలోనే తన స్నేహితులతో కలిసి ఓ చిన్న గ్యాంగ్‌ను ఏర్పాటు చేస్తాడు. ఈ గ్యాంగ్‌కు శంకర్ సహకారం కూడా అందుతుంది. స్కూల్ రోజుల్లో శంకర్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ, సరదాగా జీవితాన్ని గడుపుతాడు. కాలేజీలో చేరిన తర్వాత దాస్ జీవితంలో ప్రేమ, గొడవలు మొదలవుతాయి. అయితే, ఈ సమయంలో దాదా శంకర్ రవి, రాజు అనే ఇద్దరు వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతాడు.శంకర్ మరణంతో దాస్ గ్యాంగ్ ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పటి వరకు హాయిగా గడిచిన వీరి జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు వీరు కొత్త మార్గాలు వెతుకుతారు. ఈ క్ర‌మంలోనే ఫలక్‌నుమాలో ఓ మటన్ షాప్‌ను ప్రారంభిస్తారు. దాస్ బిజినెస్ మంచిగా న‌డుస్తుండ‌టం వ‌ల‌న అక్క‌డ వ్యాపారం చేస్తున్న రవి, రాజుల బిజినెస్ దెబ్బ‌తింటుంది. దీంతో వీరిద్ద‌రూ దాస్ గ్యాంగ్‌తో గొడవకు దిగుతారు. ఈ ఘర్షణలో ఏం జ‌రిగింది. దాస్‌ని పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు. టింక్ అనే వ్య‌క్తి వ‌ల‌న దాస్ లైఫ్‌లో జ‌రిగిన ప‌రిస్థితులేంటి అనేది ఈ సినిమా క‌థాంశం.

‘వెళ్లిపోమాకే’, ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ చిత్రాల్లో న‌టించిన విశ్వక్ సేన్ ఈసారి మెగా ఫోన్ పట్టారు. హీరోగా నటించి తానే దర్శకత్వం వహించారు. మలయాళ సినిమా ‘అంగమలి డైరీస్’కు ఇది రీమేక్. దానిలో కొద్దిపాటి మార్పులు చేసి, హైదరాబాద్‌ పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించారు. ఇది చాలా చిన్న కథ. ఇలాంటి కథకు కథనం చాలా ముఖ్యం. కానీ, సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదించింది. సీరియల్ మాదిరిగా సాగదీశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870