భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది.’కలాం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో ప్రఖ్యాత నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త యావత్ భారతీయ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.’కలాం’ చిత్రానికి బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సంయుక్తంగా నిర్మించనున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన డాక్టర్ కలాం(APJ Abdul Kalam) ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం.’మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఆయన, నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి గొప్ప ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, దార్శనికుడిగా, ప్రజల రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ నేటికీ ఎన్నో తరాలకు ప్రేరణనిస్తోంది. ఈ చిత్రంలో డాక్టర్ కలాం పాత్రలో ధనుష్ కనిపించనుండటం విశేషం.
సమయం
ఈ సినిమా గురించి దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ,ఇది ప్రపంచ యువతకు,స్ఫూర్తినిచ్చే కథ.ఆయన జీవితం ఒక పాఠం,అని తెలిపారు.ఇండియన్ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి వస్తున్నాడు. పెద్దగా కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి” అని ఓం రౌత్(Om Raut) ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఓం రౌత్ చివరగా ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శలు ఎదుర్కొన్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సమయంలో దర్శకుడిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఓం అబ్దుల్ కలాం బయోపిక్ అనౌన్స్ మెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఓం రౌత్ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే ఎక్కువగా జీవిత చరిత్రలనే తెరకెక్కించారు. బాల గంగాధర్ తిలక్ బయోపిక్ గా ‘లోకమాన్య’, ‘తానాజీ’ కథతో హిస్టారికల్ మూవీ, శ్రీరాముడి స్టోరీతో ‘ఆదిపురుష్’ సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో కలాం బయోపిక్ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.
వెండితెర
భారతరత్న పురస్కార గ్రహీత డా.అబ్దుల్ కలాం ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లలో పని చేసిన కలాం ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచారు.భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి గొప్ప ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, ప్రజల రాష్ట్రపతిగా ఎదిగిన కలాం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇందులో టాలీవుడ్ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర భాగం పంచుకోవడం గమనార్హం.
Read Also: Pendulum Movie: ‘పెండ్యులం’ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ