తమిళ నటుడు సంతానం ప్రత్యేకమైన హాస్యశైలి, హారర్–కామెడీ సినిమాల ఎంపికతో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డీడీ (Devil’s Double) ప్రాంఛైజీలో భాగమైన సినిమాలు తమిళంలో మంచి ప్రేక్షకాదరణ పొందాయి. భయంతోపాటు నవ్వులు పూయించే కథనాలతో ఈ చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో విజయవంతమయ్యాయి.బూతు బంగ్లా, దెయ్యాల కోటలోకి హీరో అండ్ టీం వెళ్లడం, అక్కడ దెయ్యాలతో ఆటలు, బయటకు వచ్చేందుకు పడే పాట్లు, మధ్యలో చిన్న ఫ్లాష్ బ్యాక్, చివరకు హీరో అండ్ టీం సేఫ్‌గా బయటకు రావడం అనేది పాయింట్.
సోషల్ మీడియా
కానీ,చివరగా డీడీ నెక్ట్స్ లెవెల్ అంటూ సంతానం ప్రేక్షకుల్ని మెప్పించేశారు. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్‌ను కూడా బాగానే వాడుకున్నారు. ఈ చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభించింది. రివ్యూలు, సోషల్ మీడియాలో రివ్యూలు చెప్పే వారిపై కౌంటర్లుగా ఈ సినిమా ఉంటుందని అర్థం అవుతోంది. ఇక అలా రివ్యూలు చెప్పే వ్యక్తిగా సంతానం(Santānaṁ) ఈ చిత్రంలో కనిపిస్తారు.థియేటర్లో మంచి విజయాన్ని సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా తెలుగులోకి రాబోతోంది. జీ5(ZEE 5)లో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
సృజనాత్మకంగా
ఈ సందర్భంగా సంతానం మాట్లాడుతూ ఇటీవల నేను చేసిన పాత్రల్లో కిస్సా కారెక్టర్ నా కెరీర్‌లో అత్యంత వినోదభరితమైన, సృజనాత్మకంగా తృప్తి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ కిస్సా పాత్ర(Qissa character) బోల్డ్‌గా ఉంటుందని తెలిపారు. ఇదొక విలక్షణమైన పాత్ర అని పేర్కొన్నారు. సినిమాలను విమర్శించే రివ్యూవర్ తన జీవితంలో అనుకోకుండా తను ఇష్టంగా విమర్శించే సినిమాల్లాగే ఒక సినిమాలో చిక్కుకుంటాడనే పాయింట్ మీద తీశారని తెలిపారు.

ప్రముఖులు
ఇక ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రీమన్‌దీప్ సింగ్, మునీశ్ కాంత్ వంటి ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. యాక్షన్, హాస్యం, హారర్ అన్నీ కలబోసిన కథనంతో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా డైయలాగ్స్, కామెడీ టైమింగ్, అన్నీ ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఉన్నాయని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
సంతానం తెలిపారు
సంతానం ఇంకా మాట్లాడుతూ, “ఈ మెటా మాడ్‌నెస్, హారర్-కామెడీలోని ట్విస్టులు, ట్రీట్మెంట్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ జీ5లో ఆనందంగా ఉందని సంతానం తెలిపారు.ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అని చెప్పుకొచ్చారు. లైట్లు ఆఫ్ చేసి, చేతిలో పాప్‌కార్న్ తీసుకుని ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని అన్నారు. కామెడీ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చెప్పుకొచ్చారు.ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌లాంటి మూవీ అని నమ్మకంగా చెప్పారు.
Read Also: Sudha Murthy: ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధా మూర్తి ప్రశంసలు