हिन्दी | Epaper

Actor: చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి :సూర్య

Anusha
Actor: చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి :సూర్య

సూర్య రెట్రో చిత్రం మే 1న రాబోతోంది. ఈ క్రమంలో సూర్య హైదరాబాద్‌కు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్టుగా వచ్చి స్పీచ్ అదరగొట్టేశాడు.ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సూర్య తన రాబోయే సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి, సితార నాగవంశీతో నెక్ట్స్ సినిమా ఉంటుందని అన్నాడు. అయితే తమిళ సినిమాగానే ఉంటుందని అంటున్నాడు సూర్య. ఈ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ ‘నేను ఒక వేళ రెట్రో టైంలోకి వెళ్తే నా 90వ దశకంలోని కాలేజీ రోజుల్లోకి వెళ్తాను అవే జీవితంలో గొప్ప రోజులు నేనే ఈ స్థాయికి వచ్చానంటే మీరు (ఆడియెన్స్, అభిమానులు) ఇంకా ఎంతో స్థాయికి వెళ్లగలరు ప్యాషన్, కష్టపడే తత్త్వం ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించొచ్చు మీలో (అభిమానులు) కొంత మంది చేతుల్ని చూశాను అక్కడ నా పేరుని టాటూగా వేయించుకున్నారు.నాకు ఇప్పటికే తెలుగు వాళ్లు ఎక్కువ ప్రేమను ఇచ్చారు నాకు అది చాలు అలా టాటూలు వేయించుకోకండి మీ కోసం మీరు కష్టపడండి లైఫ్‌లో సక్సెస్ సాధించండి ఈ రెట్రో సినిమా విషయానికి వస్తే ఇది కార్తీక్ సుబ్బరాజ్ సినిమా ఆయన మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది.ఆయన జానర్లు, చూపించిన విధానం అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి.ఇక ఇందులో సంతోష్ నారాయణ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ప్రకాష్ రాజ్, నాజర్ వంటి వారితో చాలా కాలం తరువాత నటించాను.

నెక్ట్స్ సినిమా

పూజా హెగ్డే నా కంటే ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేసింది,ఆమె ఈ రోజు బిజీగా ఉండటంతో రాలేదనుకుంటా మే 1న మీరంతా రెట్రోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నాగవంశీది లక్కీ హ్యాండ్ అని చాలా మంది చెబుతున్నారు,ఆయనతో చేతులు కలపడం ఆనందంగా ఉంది. అల్లు అరవింద్ గారి వల్ల నా ఈ జర్నీ తెలుగులో ప్రారంభమైంది. వెంకీ అట్లూరి, నాగవంశీలతో నెక్ట్స్ సినిమా చేయబోతోన్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్-3’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కింగ్ డమ్’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు’ అని సూర్య చెప్పుకొచ్చారు.

Read Also: Die Hard Fan: విజయ్ని కలిసేందుకు వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

📢 For Advertisement Booking: 98481 12870