‘ఉప్పెన’ సినిమాతో నేషనల్ అవార్డ్ సాధించిన బుచ్చిబాబు సానా ప్రస్తుతం ‘పెద్ది’ ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఆయన సినిమాలకు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. బుచ్చిబాబు తీసే సినిమాలు ఇతర చిత్రాలతో పోలిక లేకుండా ఉంటాయి. ఆయన సినిమాలో ఎక్కువగా రూరల్ బ్యాక్‌డ్రాప్ ఉండేట్లు చూసుకుంటారు. తాజా చిత్రం ‘పెద్ది’ టీజర్లోనూ విలేజ్ బ్యాక్‌డ్రాప్(Village backdrop)లోనే తెరెక్కుతున్నట్లు చూపించారు.పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో బుచ్చిబాబు రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తన సినీ కెరీర్ గురించి తాజాగా బుచ్చిబాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను సినిమాల్లోకి రావడం అంత ఈజీగా జరగలేదన్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు తన కుటుంబసభ్యులు మద్ధతు ఇవ్వలేదని, వారి కోసమే ఎంబీఏలో చేరినట్లు చెప్పారు. బుచ్చిబాబు మాట్లాడుతూ “మొదటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఆశగా ఉండేది. కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను బాగా చదువుకుని సెటిల్ అయితే చూడాలనేది వారి కోరిక. నా సోదరి ప్లాస్టిక్ సర్జన్. వాళ్లను నొప్పించడం ఇష్టంలేక హైదరాబాద్‌లోని ఒక కళాశాలలో ఎంబీఏ(MBA)లో చేరా. మధ్యాహ్నం వరకు క్లాసులకు వెళ్లి ఆ తర్వాత నాకు ఇష్టమైన సినిమాపై దృష్టిసారించేవాడిని. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ వద్ద పనిచేశా. ఆయన తెరకెక్కించిన 100% లవ్, ఆర్య2, రంగస్థలం చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేశా” అని అన్నారు.

వాతావరణం
ఆ తర్వాత ‘పెద్ది’ గురించి మాట్లాడుతూ “ఈ మూవీలో క్రికెట్ కేవలం బ్యాక్‌డ్రాప్ మాత్రమే. ఎమోషన్ ఎంతో ముఖ్యం. విజయనగరం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే ఈ సినిమా కథ రాసుకున్నా. రామ్ చరణ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. సంగీత దర్శకుడు రెహమాన్ ఒక్కో పాటకు 20 నుంచి 30 ఆప్షన్స్ మాకు ఇస్తున్నారు. అలాగే సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది” అని బుచ్చిబాబు చెప్పారు.ఈ సినిమాకు ప్రేక్షకులు ‘వావ్’ అని ఫిదా అయ్యేలా కాకుండా, భావోద్వేగంతో మనసును హత్తుకునేలా తెరకెక్కిస్తానని అన్నారు.అందుకే నా సినిమాలు పెద్ద పట్టణాల నేపథ్యంలో కాకుండా పల్లెటూరి వాతావరణంలో ఉంటాయి’ అని దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) అన్నారు.గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ లీడ్‌లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’పై భారీగానే అంచనాలు ఉన్నాయి. క్రికెట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో భావోద్వేగాలు, ఆసక్తికర సన్నివేశాల్లాంటి అంశాలు బోలెడన్ని ఉండనున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. అలాగే రీసెంట్గా సినిమా నుంచి మేకర్స్ వీడియో గ్లింప్స్(Video Glimpses) రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్ దాటింది.కాగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ కూడా ఇప్పటికే 30 శాతం పూర్తైనట్లు రీసెంట్గా రామ్‌చరణ్ తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన త్వరలోనే మళ్లీ పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్లో హీరోపై కీలక ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ సెన్సేషన్ ఎఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Read Also: Actor: ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకు రాబోతోన్నాం:మంచు విష్ణు