ఇన్స్‌పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగుబిడ్డ, రౌడీ ఇన్స్‌పెక్టర్, లక్ష్మీనరసింహ, భగవంత్ కేసరి ( ప్లాష్‌బ్యాక్‌లో) తదితర సినిమాల్లో బాలయ్య పోలీసు దుస్తుల్లో కనువిందు చేశారు. అయితే ఈ చిత్రాలన్నింటిలో ఆయనకు ‘లక్ష్మీ నరసింహ’ సినిమా ప్రత్యేకం. ఇందులో ఆయన లుక్, డైలాగులు, యాక్షన్ సీన్లు గత చిత్రాలకు భిన్నంగా ఫ్యాన్స్‌ని భలేగా ఆకట్టుకున్నాయి.2003లో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘సామి’ చిత్రాన్ని తెలుగులో ‘లక్ష్మీ నరసింహ’గా రీమేక్ చేశారు. జయంతి సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణ ఏసీపీ లక్ష్మీ నరసింహ(Lakshmi Narasimha)గా పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపిస్తారు. సంక్రాంతి కానుకగా 2004, జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బాలయ్య కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచిపోయింది. బాలయ్య మాస్ డైలాగులు, మణిశర్మ సంగీతం, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
థియేటర్లలో
ప్రతి ఏడాది జూన్ 10 అంటే నందమూరి అభిమానుల కు పండగే అవుతుంది.ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈసారి ఆ వేడుకలు డబుల్ కానున్నాయి. ఎందుకంటే బాలయ్య బర్త్‌డే సందర్బంగా ‘లక్ష్మీ నరసింహ’ చిత్రాన్ని రీ రిలీజ్(Re release) చేయనున్నారు. పుట్టినరోజుకు మూడు రోజులు ముందుగా అంటే జూన్ ఏడో తేదీని ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది.నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే మాస్ డైరెక్టర్ బోయపాటితో ‘అఖండ 2’ చేస్తున్నారు.

అఫిషియల్
ఈ సినిమా టీజర్‌ని బాలయ్య బర్త్‌డే సందర్బంగా జూన్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నామాలు చేస్తున్నట్లు సమాచారం.అఖండ 2 ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని(Tejaswini) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ ’5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినా ఆ రోజు రావడం కష్టమేనని అంటున్నారు. షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోకవడంతో గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉండటంతో ‘అఖండ 2’ దసరాకు రావడం కష్టమే అంటున్నారు. ఈ మూవీ వెనక్కి వెళ్లనున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు.‘అఖండ 1’ మూవీ డిసెంబర్ 2, 2001లో విడుదలైన ఘన విజయం సాధించడంతో దాని రీమేక్‌గా వస్తోన్న ‘అఖండ 2’ని కూడా డిసెంబర్‌లో రిలీజ్ చేస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.