हिन्दी | Epaper

Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

Anusha
Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ తాజాగా స్పందించారు. పర్యాటకులపై జరిగిన ఆ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

మరోసారి

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అజిత్‌ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అనంతరం అజిత్‌ మాట్లాడుతూ పెహల్‌గామ్‌ ఉగ్రదాడిని ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. కుల, మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలన్నారు.పెహల్‌గామ్‌ వంటి దారుణమైన ఘటనలు దేశంలో మరోసారి జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పద్మ అవార్డుల కార్యక్రమంలో సాయుధ దళాలను కలిసినట్లు చెప్పారు. వారి త్యాగాలను మెచ్చుకున్నారు. వారందరి కారణంగానే మనం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం అంటూ అజిత్‌ చెప్పుకొచ్చారు.

  Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

పారిపోయి

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్‌ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.

Read Also: Movie : ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ లీక్స్ స్పందించిన రాజమౌళి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

📢 For Advertisement Booking: 98481 12870