हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Genelia Deshmukh : సౌత్ ఇండస్ట్రీ నా కెరీర్‌ను మార్చేసిందన్న జెనీలియా

Anusha
Genelia Deshmukh : సౌత్ ఇండస్ట్రీ నా కెరీర్‌ను మార్చేసిందన్న జెనీలియా

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి జెనీలియా దేశ్‌ముఖ్ మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. ‘బొమ్మరిల్లు’, ‘సత్యం’, ‘హ్యాపీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘సై’ వంటి విజయవంతమైన చిత్రాల్లో తన చిలిపి అభినయంతో, ఆకర్షణీయమైన హావభావాలతో ప్రేక్షకుల్ని మనమొదటి చూపులోనే ఆకట్టుకున్న ఈ అందాల భామ, తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ (Tollywood star heroine) గా ఎదిగింది. ప్రత్యేకంగా ఆమెకు తెలుగులో ఉన్న అభిమాన గణాన్ని ఎవరూ ఊహించలేరు.కానీ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం, తన కుటుంబ జీవితం మీద దృష్టి పెట్టిన జెనీలియా అనంతరం సినిమాలకు దూరమైంది. అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఆమెను వెండితెరపై మళ్లీ చూడాలని ఆశపడుతుండగా, ఆ ఆశను నిజం చేస్తూ ఇప్పుడు జెనీలియా ఒక ఆసక్తికరమైన పాత్రతో మళ్లీ వస్తోంది.

సినిమా అనుభవాలను

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సితారే జమీన్ పర్’ లో జెనీలియా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇందులో వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటున్నారు జెనీలియా.విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో జెనీలియా (Genelia) వరుసగా ప్రోమోషన్లలో పాల్గొంటోంది. మీడియా సమావేశాలు, టీవీ షోల్లో ప్రత్యక్షమవుతూ, తన గత సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంది.ఈ నేపథ్యంలోఒక యాంక‌ర్ జెనీలియాని అడుగుతూ మీకు సౌత్ ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు చెప్పుకోదగ్గ పాత్రలు అంద‌లేదు కదా అని అడుగుతాడు.

ఉత్తమ పాత్రలు

దీనికి జెనీలియా స్పందిస్తూ యాంక‌ర్ మాటాల‌ను త‌ప్పుబ‌ట్టింది. నాకు ఎప్పుడూ అలా జ‌రుగ‌లేదు. నా సౌత్ సినిమాలు చూసుకుంటే నాకు ఎప్పుడూ ఉత్తమ పాత్రలు వచ్చాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ (South Indian Film Industry) లో నేను చేసిన ప‌ని నాకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. సౌత్ నా కెరీర్ ఎదిగిన స్థ‌లం ఇక్క‌డ‌ నాకు లభించిన పాత్ర‌ల‌ను నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ జెనీలియా చెప్పుకోచ్చింది.మొత్తానికి జెనీలియా ‘సితారే జమీన్ పర్’ చిత్రం (‘Sitare Zameen Par’)ద్వారా మళ్లీ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించనుందనడంలో సందేహమే లేదు. ఆమె అభిరుచి, అభినయం ఈ తరం ప్రేక్షకులకూ నచ్చుతుందా? అనేది చూడాలి.

Read Also: Aamir Khan : రూ.120 కోట్ల డీల్ వదులుకున్న హీరో : ఆమిర్‌ ఖాన్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870