టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా మారిన క్యారక్టర్ ఆర్టిస్టుల్లో మురళీధర్ గౌడ్ (Actor Muralidhar Goud) పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. సహజమైన నటన, తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ నటుడు, తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ సినిమాతో మురళీధర్ గౌడ్‌కు స్టార్‌డమ్ వచ్చింది. టిల్లు డాడీ పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Read Also: Dheekshith Shetty: ‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!
వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు
ఈతరం యువతీ యువకుల గురించి ఆయన మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్పినా వినడం లేదని, వాళ్లకై వాళ్లే పెరుగుతున్నారని మురళీధర్ (Actor Muralidhar Goud) అన్నారు.ఇప్పుడు తనకు ఇళ్లు, షూటింగ్ లొకేషన్, డబ్బింగ్ స్టూడియో తప్ప ఇంకేమీ తెలియవని మురళీధర్ గౌడ్ చెప్పారు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ కి ఎక్కువగా అటెండ్ అవ్వనని.. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదన్నారు. తనకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగిందని, ఇద్దరు కుమారులు ఉన్నారని ఆయన తెలిపారు. ”అమ్మాయిలు లేనందుకు బాధ పడుతున్నారా?

ఈ జనరేషన్ అమ్మాయిల్ని చూసి లేకపోవడమే మంచిది అనుకుంటున్నారా?” అని యాంకర్ ప్రశ్నించగా.. ”ఈ సమాజమే నాకు నచ్చడం లేదు. భర్తలను భార్యలు చంపుతున్నారు. ‘ఇంటి పనులు వదిలేసి 24 గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావ్’ అని భర్త అన్నందుకు ఓ భార్య గొడ్డలితో కొట్టేసింది. తన ఇద్దరు పిల్లలు పక్కన ఉండగానే ఈ పని చేసింది. అసలేంటి ఇది?. ఎవరి కంట్రోల్ లో ఎవరు ఉంటున్నారు?. ఇలా అయితే కష్టం. చాలా బాధ అనిపిస్తుంది” అని మురళీధర్ గౌడ్ సమాధానమిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: