हिन्दी | Epaper

8 Vasantalu Teaser: 8 వసంతాలు టీజ‌ర్ చూసారా?

Anusha
8 Vasantalu Teaser: 8 వసంతాలు టీజ‌ర్ చూసారా?

తెలుగు యువ ద‌ర్శ‌కుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). దాదాపు 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టిన ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండ‌గా ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సునిల్ కుమార్ లీడ్ రోల్‌లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా మ‌రో అప్‌డేట్‌ను పంచుకుంది.

కొత్త టీజ‌ర్‌

జూన్ 20న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త టీజ‌ర్‌ను పంచుకుంది. ఫ‌స్ట్ టీజ‌ర్‌లో క‌థానాయిక‌ను ప‌రిచ‌యం చేసిన టీమ్ రెండో టీజ‌ర్‌లో హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసింది. మ‌ధురం అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ర‌వితేజ దుగ్గిరాల(Ravi Teja Duggirala) ఈ సినిమాలో కథానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు.‘ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత అత‌డు. తను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూలలా ఉంటాయి. అదే కసితో రాస్తే, పిన్‌ పీకిన గ్రనేడ్‌లా ఉంటాయి’ అంటూ మొదలైన టీజర్(Teaser) ప్రేమ క‌విత్వంతో పొంగిపోయేలా ఉంది. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ అకట్టుకుంది. ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారిన ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి.

Read Also: Poorna: కుటుంబంతో కలిసి బక్రీద్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న పూర్ణ‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

📢 For Advertisement Booking: 98481 12870