పొరుగు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే చైనా(China) తన ఆయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. ప్రపంచంలోనే ఏ దేశం ఉత్పత్తి చేయనంతగా వేగంగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోంది. స్వీడన్(Sewden)కు చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సిప్రీ నివేదిక చైనా ఆయుధాలపై కీలక విషయాలు వెల్లడించింది. 2023 నుంచి ఏటా 100 చొప్పున న్యూక్లియర్(Nuclear) వార్‌హెడ్‌లను డ్రాగన్ తయారు చేస్తున్నట్టు తెలిపింది. వచ్చే పదేళ్లలో రష్యా, అమెరికాకు చేరువయ్యేలా వార్‌హెడ్‌లను చైనా రూపొందిస్తున్నట్టు అంచనా వేసింది.
ప్రస్తుతం చైనా వద్ద ఉన్న న్యూక్లియర్ ఆయుధాలు
ప్రస్తుతం చైనా వద్ద 600 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నట్టు సిప్రీ నివేదిక వెల్లడించింది. రాబోయే పదేళ్లలో ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేసింది. పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్‌హెడ్‌లను చైనా తయారు చేస్తున్నప్పటికీ అమెరికా, రష్యా వద్ద ఉన్న వార్‌హెడ్‌లకు చాలా దూరంలో ఉంటుందని సిప్రీ నివేదిక పేర్కొంది.

జిన్‌పింగ్ లక్ష్యంతో పెరుగుతున్న మిలిటరీ శక్తి
సిప్రీ నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది. సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్‌హెడ్‌లను తయారు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసింది. చైనా జాతీయ భద్రతకు అవసరమైన సంఖ్యలోనే వార్‌హెడ్‌లను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. మొదట అణ్వాయుధాలను ప్రయోగించకూడదనే విధానాన్ని చైనా కచ్చితంగా పాటిస్తుందని తెలిపింది. అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని బెదిరించమని వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 21వ శతాబ్దం మధ్య నాటికి చైనాను ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా మార్చాలనే లక్ష్యం నిర్ణయించారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా అణ్వాయుధాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నారు.
పాకిస్థాన్ కూడా ముందుకు
ఈ శతాబ్దం మధ్య నాటికి చైనాను ప్రపంచస్థాయి మిలిటరీ శక్తిగా మార్చాలన్న అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు నేపథ్యంలో న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సంఖ్యను డ్రాగన్ పెంచుతున్నట్టు తెలుస్తోంది. చైనాతో పాటే పాకిస్థాన్ కూడా పెద్ద ఎత్తున వార్‌హెడ్‌లను తయారు చేస్తున్నట్టు సిప్రీ నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా వద్ద 4,309 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉండగా, అమెరికా వద్ద 3,700 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయి. SIPRI నివేదిక ప్రకారం, చైనా మాత్రమే కాకుండా
పాకిస్థాన్ కూడా పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్‌హెడ్‌లను తయారు చేస్తోంది.
Read Also: Israel-Iran War : యుద్ధంలోకి అమెరికా?