हिन्दी | Epaper

Water : నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

Sudha
Water : నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

ఆరోగ్యంగా ఉండాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని మనకు తెలుసు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకుంటే అనేక దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయంటున్నారు. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు రోజూ మందులు వాడుతుంటారు. అయితే.. వీరు తగినంత నీరు (Water)తాగడం అలవాటు చేసుకుంటే.. హైబీపీ కూడా అదుపులోకి వస్తుందంటున్నారు నిపుణులు. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్‌, లో,గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు, గుండె వైఫల్యం ముప్పులు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇజ్రాయెల్‌లోని బార్‌-ఇలాన్‌ యూనివర్సిటీ నిర్ధారించింది. సుమారు నాలుగు లక్షల మంది మీద చేసిన పరిశోధనలో తగినంత నీరు (Water)తాగితే సహజంగానే శరీరంలో సోడియం సాంద్రత తగ్గుతుందని వారు గుర్తించారు. దీన్ని చిన్న విషయంగా భావించవద్దని, ఇది దీర్ఘకాల గుండెజబ్బుల నివారణకు ఉత్తమ మార్గమని చెబుతున్నారు.

Read Also : http://Andhra pradesh: ఇక పై వీటికి ఉచితంగా చికిత్సలు

Water
Water

రక్తంలో సోడియం మోతాదులు 135 నుంచి 146 ఎంఎంఓఎల్‌/ఎల్‌ ఉండటం నార్మల్‌గా భావిస్తారు. అయితే..సోడియం మోతాదులు 140 నుంచి 146 ఎంఎంఓఎల్‌/ఎల్‌ ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్‌/ఎల్‌ కన్నా మించితే.. హైబీపీ రిస్క్ 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్టు వారు నిర్ధారించారు. ఈక్రమంలో ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా కీలకమని ఈ పరిశోధన తెలియజేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఆయా వ్యక్తుల ఆరోగ్యం, చేసే పనులు, వాతావరణాన్ని బట్టి నీటి అవసరం మారుతుందని వెల్లడించారు. ఇది అవగాహన మాత్రమే. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాటు కోడి గుడ్డు vs ఫారం గుడ్డు.. పిల్లలు దేనిని తినాలి?

నాటు కోడి గుడ్డు vs ఫారం గుడ్డు.. పిల్లలు దేనిని తినాలి?

గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్ల‌ను రోజూ తినాలి..

గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్ల‌ను రోజూ తినాలి..

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

త‌క్ష‌ణ శ‌క్తికి ఖ‌ర్జూరాలు లేదా అరటి పండ్లు ఏవి మంచివి?

త‌క్ష‌ణ శ‌క్తికి ఖ‌ర్జూరాలు లేదా అరటి పండ్లు ఏవి మంచివి?

హైబీపీ మందుల‌ను వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

హైబీపీ మందుల‌ను వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

పెరుగును తీసుకోవ‌డంపై అపోహ‌లు ఎన్నో..

పెరుగును తీసుకోవ‌డంపై అపోహ‌లు ఎన్నో..

రాత్రి ఏం తింటే మంచిది.. చపాతీ! అన్నమా?

రాత్రి ఏం తింటే మంచిది.. చపాతీ! అన్నమా?

దోమ‌లు ఎక్కువ‌గా కుడుతున్నాయా?

దోమ‌లు ఎక్కువ‌గా కుడుతున్నాయా?

నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నా థైరాయిడ్అదుపులోకి రావ‌డం లేదా..

ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నా థైరాయిడ్అదుపులోకి రావ‌డం లేదా..

📢 For Advertisement Booking: 98481 12870