हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Chacko: పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన‌ న‌టుడు చాకో

Ramya
Chacko: పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన‌ న‌టుడు చాకో

మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై వివాదాల మబ్బులు

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో తాజా వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవ‌ల కొచ్చిలోని ఓ హోట‌ల్‌పై నార్కోటిక్స్ విభాగం స‌డెన్ రైడ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో షైన్ టామ్ చాకో హోట‌ల్‌లో ఉన్న‌ట్లు ఆధారాలు ఉన్నాయని, అయితే పోలీసులు రాగానే ఆయ‌న పారిపోయిన‌ట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధార‌ణ అయింద‌ని సమాచారం. ఈ నేప‌థ్యంలో ఈరోజు ఉదయం 10 గంట‌ల‌కు చాకో తన న్యాయ‌వాదితో క‌లిసి ఎర్నాకులం పోలీస్ స్టేష‌న్‌కు హాజ‌ర‌య్యారు. పోలీసులు ఆయ‌న్ను మాద‌క ద్ర‌వ్యాల వినియోగంపై ప్ర‌శ్నించేందుకు స‌న్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అనుమానితుడా?

నార్కోటిక్ విభాగం అందించిన సమాచారం ప్రకారం, కొచ్చిలోని ఆ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ వాడుతున్నార‌నే పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టారు. అయితే పోలీసులు వచ్చేదానికంటే కొద్దిసేప‌టి ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి తప్పించుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, షైన్ మూడో అంతస్తులో ఉన్న హోటల్ గదిలో నుంచి కిటికీ ద్వారా జంప్ చేసి రెండో అంతస్తు ఫ్లోర్‌కు దూకారు. అనంతరం మెట్ల మార్గం గుండా పరుగులు తీస్తూ హోటల్ నుండి బయటపడిపోయారు. ఈ సన్నివేశాలు నెట్టింట వైరల్ కావడం, ప్రజల్లో చర్చకు దారి తీసింది. దీనితో పోలీసులు ఆయనపై మరింత దృష్టి సారించారు.

నటి విన్సీ అలోషియస్ ఆరోపణలు

ఇక మరోవైపు షైన్ టామ్ చాకోపై నటి విన్సీ అలోషియస్ తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ మత్తులో ఉన్న సమయంలో తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)కి ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విన్సీ ఆరోపణల నేపథ్యంలో చాకోపై మరింత నేర విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. AMMA సభ్యుల మధ్య కూడా ఈ విషయం పెద్ద దుమారం రేపుతోంది.

నెట్టింట షైన్ టామ్ చాకోపై తీవ్ర విమర్శలు

సోషల్ మీడియాలో షైన్ టామ్ చాకోపై విమర్శల వర్షం కురుస్తోంది. సీనియర్ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తి ఇలా మాదక ద్రవ్యాల కేసుల్లో చిక్కుకోవడం బాధాకరమని నెటిజన్లు అంటున్నారు. కొందరు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం పూర్తి నిజం బయటకు వచ్చేవరకు తేల్చేయొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం చాకో మీడియాకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా న్యాయపరమైన దారులను అనుసరిస్తున్నారు.

వివాదాల ముసుగులో షైన్ టామ్ చాకో భవిష్యత్తు ఏమిటి?

ఈ కేసు తీరుపై షైన్ టామ్ చాకో కెరీర్ దశ తిరగబోతోందా? అన్న అనుమానాలు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ కొన్ని వివాదాల్లో చిక్కుకున్న షైన్ ఈసారి సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు విచారణ తర్వాత దాఖలు చేసే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు కొనసాగనున్నాయి. నార్కోటిక్స్ శాఖా, మహిళా సంఘాలు కూడా ఈ కేసును ఎంతో సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

READ ALSO: Hero Ajith Kumar : మరోసారి తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870