ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ జాట్ సినిమాలో నటించారు, ‘ గద్దర్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత, వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన,జాట్ సినిమాతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు.ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.గోపిచంద్ మలినేని గతంలో ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈసారి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో జత కట్టాడు,టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సౌత్ స్టేట్స్ లో ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ, నార్త్ లో మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి.
కొత్త మిషన్
కాగా ‘జాట్’ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ‘జాట్ 2’ అనే టైటిల్ తో ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత జాట్ రెస్ట్ తీసుకోవడం లేదని అతను మరో కొత్త మిషన్ వైపు వెళ్తున్నాడని పేర్కొన్నారు. ఈసారి మాస్ ఫీస్ట్ మరింత పెద్దదిగా, ధైర్యంగా, వైల్డ్‌గా ఉంటుందని తెలిపారు. సన్నీడియోల్ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

మనోభావాలు
మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ నేపథ్యం లో జాట్ మూవీకి పెద్ద షాక్ తగిలింది. ఆ ఫిల్మ్‌లో నటించిన సన్నీ డియోల్‌తో పాటు రణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు రిజిస్టర్ చేశారు. ఆ ఫిల్మ్‌లోని ఓ సీన్‌లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జలంధర్ పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. జాట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు పెట్టినట్లు తెలుస్తోంది.ఆ ఫిల్మ్‌లో క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సీన్ ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌరవపరుస్తున్న రీతిలో సీన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో కావాలనే ఆ సినిమాను రిలీజ్ చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే డైరెక్టర్, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: Akshay Kumar: కేసరి 2 మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్షయ్ కుమార్