రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అదృష్టం 24 గంటల్లో మారిపోయింది. ఈ 24 గంటల్లోనే ముఖేష్ అంబానీ ఆదాయాల పరంగా చాల మంది పెద్ద పేర్లను కూడా అధిగమించాడు, వారిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ కూడా ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో 7 మంది నష్టాలను చవిచూశారు. నిన్న శుక్రవారం రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దింతో అంబానీ మొత్తం విలువ కూడా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ 24 గంటల్లో 2.92 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 వేల కోట్లు) పెరిగింది. మరోవైపు ఈ 24 గంటల్లో ఎలోన్ మస్క్ 558 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5 వేల కోట్లు) నష్టాపోయారు.

లారీ ఎల్లిసన్ కంటే ముకేశ్ అంబానీ ముందు
అంబానీ కంటే ముందు ఎవరు: గడిచిన 24 గంటల ఆదాయంలో అమెరికన్ పెట్టుబడిదారుడు లారీ ఎల్లిసన్ ముకేశ్ అంబానీ కంటే ముందున్నాడు. ఎల్లిసన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్‌కు ఛైర్మన్ అండ్ CTO కూడా. ఎల్లిసన్ 24 గంటల్లో $3.29 బిలియన్లు సంపాదించారు. ఆదాయాల పరంగా ఎల్లిసన్ తర్వాత ముఖేష్ అంబానీ తరువాత స్థానంలో ఉన్నారు. అంబానీ తర్వాత మూడవ స్థానంలో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ మైఖేల్ డెల్ ఉన్నారు. డెల్ మొత్తం విలువ 24 గంటల్లో $2.53 బిలియన్లు పెరిగింది.
ప్రముఖ దిగ్గజాలకు నష్టం : ఈ 24 గంటల్లో చాలా మంది పెద్ద కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇందులో ఎలోన్ మస్క్ మాత్రమే కాకుండా మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ మొదలైన వారు కూడా ఉన్నారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల లిస్టులో వీరి పేర్లు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లారీ ఎల్లిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సంపద మాత్రమే ఈ 24 గంటల్లో పెరిగింది.
ముకేశ్ అంబానీ నికర విలువ
ముఖేష్ అంబానీ నికర విలువ $88.1 బిలియన్లు. ఈ నికర విలువతో అతను ప్రపంచంలోని 17వ ధనవంతుడిగా ఉన్నారు. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు కూడా. భారతదేశంలోని రెండవ అత్యంత ధనవంతుల లిస్టులో గౌతమ్ అదానీ పేరు ఉండగా, అదానీ నికర విలువ $68.9 బిలియన్లు. అతను ప్రపంచంలోనే 21వ ధనవంతుడు. అలాగే, ముఖేష్ అంబానీ తర్వాత అదానీ ఆసియాలోని అత్యంత ధనవంతుల లిస్టులో రెండవ స్థానంలో ఉన్నారు.