Audi Car Price Hike: లగ్జరీ కార్ల ప్రియులకు ఆడి ఇండియా చేదు వార్త వినిపించింది. దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ పెంపు గరిష్టంగా 2 శాతం వరకు ఉండవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి

ఎప్పటి నుండి అమల్లోకి?
పెరిగిన ఈ ధరలు 2026, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఆడి కార్ల కొనుగోలు మరింత భారం కానుంది. ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ఆర్థిక పరిస్థితులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.
ధరల పెంపుపై ఆడి ఇండియా వివరణ
ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. “దేశంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో వస్తున్న హెచ్చుతగ్గుల వల్ల వాహనాల ధరలను సవరించక తప్పడం లేదు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని వివరించారు. లగ్జరీ కార్ల విభాగంలో నాణ్యతను కొనసాగించేందుకు ఈ పెంపు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :