ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఈ-కామర్స్, టెక్ కంపెనీలలో అమెజాన్ ఒకటి. తాజాగా ఈ సంస్థలో సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. CNBC తెలిపిన వివరాల ప్రకారం, ఇవాళ్టి నుంచే ఈ లేఆఫ్స్ ప్రకటనకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతగా భావిస్తున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం వెనుక ఎన్నో ఆర్థిక, వ్యూహాత్మక కారణాలు దాగి ఉన్నాయి.
Latest News: SBI: గ్లోబల్ ఫైనాన్స్ అవార్డులతో ఎస్‌బీఐకు ప్రపంచ గుర్తింపు
కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ భారీగా పెరగడంతో, అమెజాన్ విపరీతంగా నియామకాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్న అమెజాన్‌లో కేవలం కార్పొరేట్ విభాగంలోనే 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. పోస్ట్-పాండెమిక్ కాలంలో ఆన్‌లైన్ డిమాండ్ తగ్గడం, గ్లోబల్ ఎకానమీ మందగమనం, అధిక ఖర్చులు వ్యాపారంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో సంస్థ మళ్లీ లాభదాయకతపై దృష్టి పెట్టి ఖర్చు తగ్గించే చర్యలు చేపడుతోంది.

ఇప్పటికే అమెజాన్ పలు విభాగాల్లో ప్రాజెక్టులను నిలిపివేయడం, ఆటోమేషన్ పెంచడం వంటి మార్పులు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. AI, రోబోటిక్స్ పెరుగుదలతో భవిష్యత్తు వర్క్‌ఫోర్స్ నిర్మాణం పూర్తిగా మారిపోనుంది. ఈ లేఆఫ్స్ ఉద్యోగులకు మాత్రం కఠిన అనుభవమే అయినప్పటికీ, అమెజాన్ వ్యాపార వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ టెక్ సెక్టార్ అంతటా ఇలాంటి ఉద్యోగ కోతలు భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/