Jharkhand: వరుస ఎన్‌కౌంటర్ల తో సతమతమవుతోన్న మావోయిస్టు లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఉదయం 5.30 నుంచి ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంకా కొనసాగుతున్న కాల్పులు
ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు, కోబ్రా కమాండోలు ఎస్ఎల్ఆర్ , ఇన్సాస్ రైఫిల్స్, ఒక పిస్టల్ పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీఆర్‌పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ వివేక్ బృందం పాల్గొన్నట్లుగా స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు పేర్కొన్నారు. మృతుల్లో వివేక్ కూడా ఉన్నట్లుగా ధృవీకరించారు. అయితే, మావోయిస్టు అగ్ర నేత వివేక్ తలపై రూ.కోటి వరకు రివార్డు ఉందని వారు తెలిపారు.
Read Also: భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం