हिन्दी | Epaper

Kunal Kamra: హైకోర్టును ఆశ్రయించిన కునాల్‌ కమ్రా

sumalatha chinthakayala
Kunal Kamra: హైకోర్టును ఆశ్రయించిన కునాల్‌ కమ్రా

Kunal Kamra: స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కమ్రాపై పోలీసులు ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేశాడు. కమ్రా తమిళనాడు వాసి కావడంతో ఈ కేసులో అతడు మద్రాసు హైకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన కునాల్‌ కమ్రా

షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు

ముంబైలోని ఖార్‌ ప్రాంతంలోని ది హాబిటాట్‌ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్‌ కమ్రా దిల్‌తో పాగల్‌ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కునాల్‌ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్‌ సైతం డిమాండ్‌ చేశారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్‌ కమ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. షిండేపై వ్యాఖ్యల నేపథ్యంలో కమ్రాపై ముంబైలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870