తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో (Karthi) కార్తీ. కార్తీ (Karthi) నటించిన తమిళ సినిమా ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు డిసెంబర్ 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రచారం చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫైనాన్సియల్ ఇష్యూస్ కారణంగానే వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.
Read Also: Akhanda-2: అఖండ-2పై టీజీ హైకోర్టులో పిటిషన్

సినిమా విడుదల వాయిదా
అయితే, ‘వా వాతియార్’ (అన్నగారు వస్తారు) సినిమా విడుదలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన నిర్మాణ సంస్థ ‘స్టూడియో గ్రీన్’ తరపున వ్యాపారవేత్త అర్జున్ లాల్ వద్ద తీసుకున్న రూ.10.35 కోట్ల రుణాన్ని వడ్డీతో కలిపి రూ.21.78 కోట్లు చెల్లించడంలో విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు మధ్యంతర స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పు చెల్లించే వరకు సినిమా విడుదల చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: