Russia: ఉక్రెయిన్‌పై దాడి 20 మందికి పైగా మృతి

Russia: ఉక్రెయిన్‌పై దాడి 20 మందికి పైగా మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. పండుగ వేళ కూడా సంస్కరణలు, శాంతి మార్గాన్ని పక్కన పెట్టిన రష్యా, సాధారణ ప్రజలపై భయంకరమైన దాడులు జరిపింది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న రష్యా ఆర్మీ రెండు క్షిపణులతో తీవ్ర దాడికి దిగింది. ఈ దాడిలో 20 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం సందర్భంగా స్థానికులంతా ఒక్కచోట చేరిన సమయంలో రెండు క్షిపణులతో రష్యా దాడి చేసింది.సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

Advertisements
 Russia: ఉక్రెయిన్‌పై దాడి  20 మందికి పైగా మృతి

ఉక్రెయిన్ ప్రజల్లో

ఈ దాడితో యుద్ధం మరింత ఉద్ధృతంగా మారే ప్రమాదం ఉందని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నివాసాలు కోల్పోయి శరణార్థులుగా మారారు. తాజా దాడి ఉక్రెయిన్ ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది.ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ మీద పెద్ద స్థాయిలో దాడులు చేసింది. కేవలం సైనిక స్థావరాలపై కాకుండా, ప్రజలు నివసించే నగరాలపై కూడా రష్యా క్షిపణి దాడులు జరిపింది.అనేక నగరాలు నాశనం అయ్యాయి.ఉక్రెయిన్ మాత్రం ధైర్యంగా పోరాడుతోంది. 2022 ఫిబ్రవరి 24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన తీవ్రతను సూచిస్తుంది. నాటో (ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంఘము)లో చేరకుండా ఉక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది. రష్యా డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, అనే రెండు స్వయం ప్రకటిత ఉక్రెయిన్ రాష్ట్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న తూర్పు ఉక్రెయిన్‌ లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ సాయుధ దళాల చొరబాటు జరిగింది.

Read Also: Donald Trump:డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూశారా

Related Posts
వల్లభనేని పై భూకబ్జా కేసు
వల్లభనేని పై భూకబ్జా కేసు

ఇప్పటికే కిడ్నాప్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో చుట్టుముట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై గన్నవరం పోలీసులు భూకబ్జా కేసు Read more

Rodasi : రోదసిలో ఎక్కువ కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే
sunitha1

రోదసిలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ప్రభావంగా కండరాలు బలహీనపడటం, ఎముకలు దృఢత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు Read more

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్: భారతదేశాన్ని నిర్వచించిన శకంపై మంత్రముగ్ధులను చేసే కథనం..
Freedom at Midnight

హైదరాబాద్‌: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది 1944 -1947 మధ్య కాలంలోని గందరగోళ సంవత్సరాలను ఎంతో లోతుగా, సున్నితత్వంతో విశ్లేషిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం యొక్క గ్రిప్పింగ్ Read more

Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు
Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు

ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆయుధ కర్మాగారానికి చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఛార్జ్‌మెన్‌గా పనిచేస్తున్నరవీంద్ర కుమార్‌ను పాకిస్తాన్‌కు రహస్య Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×