हिन्दी | Epaper

10th Class Results : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల..

sumalatha chinthakayala
10th Class Results : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల..

10th Class Results : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు

రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు

బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ ఉత్తీర్ణత కాలేదు. జిల్లాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే.. ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 93.90శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

వాట్సాప్ లో ఫలితాలు ఇలా..

. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.
. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.
. అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి.
. అక్కడ రోల్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
. ఈ రిజల్ట్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ

కాగా, ఏపీలో మే నెలలో టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షలలో ఫెయిలయిన విద్యార్థులు బాధ పడొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నాలుగు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Read Also: దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870