हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: ఏపీలో మరో ప్రధాన రోడ్డు విస్తరణ ఎక్కడంటే?

Anusha
Andhra Pradesh: ఏపీలో మరో ప్రధాన రోడ్డు విస్తరణ ఎక్కడంటే?

రాయలసీమలో రోడ్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నేషనల్ హైవేలతో పాటుగా, స్టేట్ హైవేలను విస్తరిస్తున్నారు.కేంద్రం సాయంతో కొన్ని ప్రాజెక్టుల్ని, పీపీపీ (ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో) విధానంలో కొన్ని రోడ్లను డెవలప్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బనగానపల్లి-ప్యాపిలి మధ్య రోడ్డును రెండు వరుసలుగా మార్చనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నారు. మొత్తం 52 కి.మీ మేర రోడ్డును విస్తరిస్తారు.ఈ మేరకు డ్రోన్ సర్వే(Drone Survey) చేసి మ్యాప్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు ఒకే వరుసలో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.బనగానపల్లి నుంచి ప్యాపిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి రెండు గంటలు పడుతోంది. ఈ రోడ్డు సరిగా లేకపోవడం, ఆర్డినరీ బస్సులు మాత్రమే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బనగానపల్లి నుంచి గార్లదిన్నె వరకు సిమెంట్ లారీలు ఎక్కువగా తిరుగుతున్నాయి.ఈ క్రమంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో దద్దణాల చెరువు దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి. బనగానపల్లి-ప్యాపిలి మార్గంలో దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. వాటిలో పాతపాడు, చిన్నరాజుపాలెం, యాగంటిపల్లె, పసుపుల, జలదుర్గం ముఖ్యమైనవి.

 Andhra Pradesh: ఏపీలో మరో ప్రధాన రోడ్డు విస్తరణ ఎక్కడంటే?
Andhra Pradesh

ప్రభుత్వం

సిగరమాన్‌ మెట్ట నుంచి వాహనాలు ఒకవైపు ప్యాపిలికి, మరోవైపు డోన్‌కు వెళ్తాయి. అయితే ఈ రోడ్డును ప్యాపిలి నుంచి బనగానపల్లి వరకు నిర్మించి, టంగుటూరు మీదుగా మహనంది మండలం గాజులపల్లె వద్ద అమరావతి రోడ్డులో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డుకు సంబంధించి ఉన్నత అధికారులు ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నారని ఆర్‌అండ్‌బీ ఏఈ హుసేని తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే దాదాపు 20 గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరతాయని,అలాగే అమరావతి రోడ్డుకు(Amaravati Road) కూడా కనెక్టివిటీ పెరుగుతుందంటున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి మ్యాప్, డీపీఆర్ తయారు చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇటు రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అందుకే రాయలసీమలోని ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ఆ పనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Read Also: Andhra Pradesh: ఆంధ్రా డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీం కోర్టు కీలక తీర్పు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870