हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Yoga Month: ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెల: సీఎం చంద్రబాబు

Anusha
Yoga Month: ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెల: సీఎం చంద్రబాబు

రికార్డు సృష్టించేలా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా మంత్‌ పాటించాలని చెప్పారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్షించారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు(CM Chandrababu) అధికారులకు సూచించారు. నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్‌ చేసిన వారికి సర్టిఫికెట్‌ ఇవ్వాలని చెప్పారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గొప్పగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారు.విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేస్తారని తెలిపారు. ఆర్‌కే బీచ్‌ నుంచి సముద్రతీరం పొడవునా ఐదు లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్లు వివరించారు. యోగా డే అనంతరం కూడా ఏపీలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని చంద్రబాబు వెల్లడించారు.

 Yoga Month: ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెల: సీఎం చంద్రబాబు
Yoga Month: ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెల: సీఎం చంద్రబాబు

యోగా డే ప్రకటించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జూన్‌ 21న యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిని చరిత్రలో నిలిపోయేలా చేపట్టాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. యోగా డే(Yoga Day) నిర్వహణపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌ ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌ వన్‌ హెల్త్‌’(Yoga for One Earth One Health). యోగా డే నాడు నిర్వహించే కార్యక్రమం రాష్ట్రంలో యోగ అభ్యాసానికి నాంది పలకాలి. కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు ‘యోగా మంత్‌’ పాటించాలి.రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.యోగా చేసేందుకు 68 ప్రాంతాలు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో 2,58,948 మంది యోగ సాధనకు అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు వివరించారు. సీఎం మాట్లాడుతూ, ‘ఆర్కే బీచ్‌(Rk Beach) నుంచి శ్రీకాకుళం వరకు బీచ్‌ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించండి. ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించండి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.

Read Also: Kadapa: కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870