हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కస్టడీ పిటిషన్ పై కోర్టును ఆశ్రయించిన వంశీ

Anusha
కస్టడీ పిటిషన్ పై కోర్టును ఆశ్రయించిన వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇటీవల పోలీసుల కస్టడీ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన వ్యాఖ్యలు, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.వంశీ తన అఫిడవిట్‌లో పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. “ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే నన్ను ఎక్కడున్నానో ట్రాక్ చేసి అరెస్టు చేశారు. దర్యాఫ్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కస్టడీ ఎందుకు? అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయంలో, ఈ కేసులో ముందుగా దర్యాఫ్తు చేసి, అవసరమైతే ఆపై అరెస్టు చేయాలి. కానీ, ఇక్కడ క్రమశిక్షణా రీత్యా తప్పిదం జరిగిందని వంశీ కోర్టుకు తెలిపారు.పోలీసులకు తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేస్తూ కస్టడీకి అప్పగించడం సమయం వృథా చేయడమేనని వాదించారు. ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించినది, అప్పట్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. వంశీ మోహన్‌పై ఆరోపణల ప్రకారం, ఆయన అనుచరులను ప్రోత్సహించి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయబడింది.

389486 vallabhaneni vamsi
సత్యవర్ధన్‌ను ఏ-5గా పేర్కొంటూ పోలీసులు క్రైం నంబరు 84/2025తో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని అఫిడవిట్‌కు జత చేశారు.వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, మంచం కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

బెయిల్ పిటిషన్‌

వంశీ బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం కావాలని కోర్టును కోరింది. కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించింది.

వంశీ అరెస్టును వైఎస్ఆర్ సిపిఅధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడ సబ్-జైల్లో వంశీని కలిసిన తర్వాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అరెస్టు రాష్ట్రంలో చట్టం,వ్యవస్థ క్షీణతకు నిదర్శనమని, పోలీసులు రాజకీయ నాయకుల ఆదేశాలకు లోబడకుండా చట్టాన్ని పాటించాలని హెచ్చరించారు.

ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి. వంశీ అరెస్టు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు, టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870