हिन्दी | Epaper

Kadapa: కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్

Anusha
Kadapa: కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రాజీవ్‌పార్కు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఆరా తీయగా వారిద్దరు అసదుల్లా, ఓవాస్‌ అని తేలింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిద్దరూ ఐదేళ్ల క్రితం వీసాతో ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం వారి వీసా గడువు ముగిసింది. దీంతో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.వీరిద్దరు అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి మొదట ఢిల్లీలో పనిచేశారు.కొంతకాలం తర్వాత నంద్యాలకు వెళ్లారు. రెండు నెలల క్రితం కడపకు వచ్చారు. వారిలో ఒకరు ఐస్‌క్రీమ్‌ షాపులో మరొకరు వేరే చోట పని చేస్తున్నారు. వారి వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడ ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. అందుకే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 Kadapa: కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్
కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు అరెస్ట్

నిర్ణయం

ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలతో పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్లిపోవాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు ఇటీవల ఏపీలోని పాకిస్థాన్ పౌరుల సమాచారం సేకరించింది.వారి వీసాలతో పాటుగా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు.అయితే తాాజాగా కడపలో ఇద్దరు అఫ్ఘానిస్థాన్ పౌరులు దొరికిపోవడం వారికి వీసాలు కూడా లేకపోవడం కలకలం రేపుతోంది. వారిద్దరికి వీసాలు లేకపోవడంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. వారికి వీసాలు ఇచ్చి తిరిగి అఫ్ఘానిస్థాన్‌కు పంపిస్తారా వారిపై కేసు నమోదు చేస్తారా అన్నది చూడాలి. అసలు వీరు అఫ్ఘానిస్థాన్ నుంచి ఎందుకు వచ్చారు.ఢిల్లీ నుంచి కడప ఎందుకు రావాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులకు కడప జిల్లా పోలీసులు సమాచారం అందించనున్నారు.

Read Also : Andhra Pradesh: టీచర్ల లీప్ యాప్‌ వార్త పై నిజంలేదు..ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870