Sunil Naik: ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఏపీ హైకోర్టు ఆదేశించినప్పటికీ నేటి పోలీసు విచారణకు హాజరు కాలేదు.
Read Also: Neredmet crime: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఈ నెల 9 వరకు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇంతకు ముందు ఆదేశించింది. ఆ గడువు ముగియడం, సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్ అర్హతపై హైకోర్టు వాదనలు వినడం ఆ రోజే జరిగిపోయాయి. అయితే, విచారణాధికారి అభ్యర్థన మేరకు విచారణ గడువును మార్చి 12 (ఈరోజు) వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువులో నేడు ఆఖరి రోజు అయినప్పటికీ, సునీల్ నాయక్ విచారణకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గైర్హాజరుపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: