సంక్రాంతి(Sankranti) పండుగను పురస్కరించుకొని భోగి వేడుకల సమయంలో వేసే మంటల విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య కోరారు. భోగి మంటల్లో ప్రమాదకర పదార్థాలు వేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.
Read Also: Sankranthi: పిండి వంటలు కరకరలాడాలంటే ఈ కిచెన్ టిప్స్ పాటించండి

భోగి మంటల్లో టైర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు, ప్లాస్టిక్ వస్తువులు, రంగులేసిన ఫర్నీచర్, నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి పదార్థాలను వేయకూడదని పీసీబీ స్పష్టం చేసింది. ఈ వస్తువులు కాల్చినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విష వాయువులు విడుదలై తీవ్ర వాయు కాలుష్యానికి దారితీస్తాయని పేర్కొన్నారు.
పిల్లలు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం
విష వాయువుల ప్రభావంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కంటి మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చని హెచ్చరించారు.
పర్యావరణానికి అనుకూలంగా భోగి వేడుకలు
సాంప్రదాయాన్ని పాటిస్తూ పర్యావరణానికి హాని(Sankranti) కలగకుండా భోగి వేడుకలను నిర్వహించాలని పీసీబీ సూచించింది. సహజమైన వ్యవసాయ వ్యర్థాలు, చెక్క ముక్కలు వంటి పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని, అవి కూడా పరిమితంగా వేయాలని కోరింది. హరిత సంక్రాంతి దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: