Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. గుంటూరులో ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, భారీ సమూహాలు అనుమతించబోమని స్పష్టం చేస్తూ పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీగా గుంటూరుకు రావద్దని అంబటికి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: AP: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ద్వాదశి ప్రదక్షిణలు

పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు
రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా బయలుదేరిన అంబటి వెంట భారీగా పోలీస్ భద్రతా బలగాలు ఉన్నాయి. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: