हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

Anusha
Andhra Pradesh: ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

ఏపీ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని చేపట్టింది,భవనాలతో పాటుగా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. అమరావతితో పాటుగా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్ని వేగవంతం చేసింది,అలాగే నగరానికి పలు ఐటీ కంపెనీలతో పాటుగా పరిశ్రమల్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈ క్రమంలో విశాఖపట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం,సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోంది. అమరావతికి రింగ్ రోడ్డు నిర్మించిన విధంగానే విశాఖకు కూడా ఒక రింగ్ రోడ్డు ఉండాలని భావిస్తున్నారు. సముద్రం, కొండలు అడ్డంకిగా ఉండటంతో పూర్తి రింగ్ రోడ్డు సాధ్యం కాదు కాబట్టి సెమీ రింగ్ రోడ్డు(semi-ring road)ను ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలోనే ఆదేశించారు. ఈ మేరకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.విశాఖపట్నంలో నేషనల్ హైవే ఉంది.విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు కేంద్రం కోస్టల్ కారిడార్(Coastal Corridor) ప్రతిపాదన చేసింది. ఇది సెమీ రింగ్ రోడ్డులో సగం అవుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలింది రింగ్ రోడ్డును అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద మొదలుపెట్టి తాళ్లపాలెం, అనకాపల్లి మీదుగా కొత్తవలస ద్వారా విజయనగరం నుండి భోగాపురం కలుపుతూ ఏర్పాటు చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి, విశాఖపట్నం పట్టణాలను టచ్ చేయకుండా అటు వైపుగా విజయనగరం మీదుగా భోగాపురం వరకు రోడ్డు వెళ్తుంది.

Bridge 02
ఏపీలో మరో సెమీ రింగ్ రోడ్డుకు ప్లాన్

రింగ్ రోడ్డు

ఈ మేరకు సెమీ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, పొడవు, వెడల్పు, భూములు, బ్రిడ్జిల నిర్మాణంపై అధ్యయనం కోసం వీఎంఆర్‌డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరతామని ఆ తర్వాత దానిని ప్రభుత్వానికి సమర్పిస్తామని చెబుతోంది వీఆర్ఎండీఏ(VRMDA). ఈ ప్రతిపాదిత సెమీ రింగ్ రోడ్డు (ఎస్‌ఆర్‌ఆర్‌) అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకు వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఇది ఆరు వరుసల్లో ఉంటుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగవంతం అయ్యాయి.ఈ క్రమంలో ఈ సెమీ రింగ్ రోడ్డును అక్కడి వరకు ప్లాన్ చేస్తున్నారు. నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు కూడా కనెక్టివిటీ ఉంటుందని చెబుతున్నారు.

Read Also : Andhra Pradesh: ఆలూరు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో ఊహించని ట్విస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870