భారత దేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీరాజ్వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచా యతీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ. పాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి పనివారల ప్రతి నిధులతో పనిచేయగా, బ్రిటిష్పాలన కాలంలో గవర్నర్ జనరల్రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు రూపుదిద్దు కున్నాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంత వీటికి బలం చేకూర్చాయి. భారత దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ (Panchayat Raj)వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ(Panchayat Raj), బ్లాకు స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పడింది. 1986లో బ్లాకుస్థాయి వ్యవస్థని మండల పరిషత్గా మార్చారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో ప్రయోగాత్మక ప్రాతిపదికగా, సమాజ వికాసా భివృద్ధి కార్యక్రమం (కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) 1952లో ప్రారంభ మైంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో బాగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యాలు, కుటీర పరిశ్రమలు అనే ఐదు రంగాలకు ప్రాధా న్యం ఇచ్చారు. 1953లో ఈ పథకాన్నే జాతీయ విస్తరణ సేవా పథకం (నేషనల్ ఎక్స్ టెన్షన్ సర్వీస్ స్కీమ్) గా దేశ మంతటా అమలు చేశారు. ఈ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన నిపుణుల కమిటీని 1956లో నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1957లో సమర్పించింది. ఈ కమిటీ సిఫా రసులే పంచాయతీరాజ్ వ్యవస్థ (ప్రజాస్వామ్య వికేంద్రీకరణ) ఏర్పాటుకు మూలాధారం అయినాయి.
Read Also : http://Maharashtra muslim reservation : మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

పంచాయితీ రాజా ఫాదర్గా
బల్వంతరాయ్ మెహతా (1900 ఫిబ్రవరి 19, 1965 సెప్టెంబరు 19) స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త, పంచా యితీ రాజ్ నూతన వ్యవస్థ మార్గదర్శకుడు. ఆయన బర్డోలి సత్యాగ్రహ భాగస్వామి. గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. స్వయం పాలన కోసం ప్రజల పోరాటం ఆయన జీవితాశయం. ప్రజస్వామ్య వికేంద్రీకరణ సంబంధంగా ‘బల్వంతరాయ్ మెహతా కమిటీ’ సిఫార్సులు దేశంలో అమలు పరచబడి, ప్రాచుర్యం పొందిన పంచాయితీ రాజ్ అనే విప్లవాత్మక కార్యక్రమంతో మెహతాగుర్తింపు పొందాడు. స్వాతంత్ర్యం తరువాత మెహతా భారతదేశ లోక్సభ కు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. పార్లమెంట్ అంచనా కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ప్రణాళిక ప్రాజెక్ట్స్ కమిటీ అధ్యక్షుడుగా రాష్ట్రాలలో మూడు అంచెల వ్యవస్థ స్థాపన కోసం మెరుగైన విధానానికి అద్భుతమైన నివేదికను సిద్ధం చేశాడు. తద్వారా భారత దేశపు పంచాయితీ రాజా ఫాదర్గా ప్రశంసించబడ్డాడు. 1952, అక్టోబరు 2న ప్రవేశ పెట్టిన సమాజ అభివృద్ధి కారక్రమం ప్రాతిపదికగా, జాతీయాభివృద్ధి మండలి 1957, జనవరి, 16న బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈకమిటీ 1953, అక్టోబరు 2న ప్రవేశ పెట్టిన జాతీయ విస్తరణ సేవాకార్యక్రమం పథకాలు ఎంత వరకు విజయవంతం అయినాయో సమీక్షించి, గ్రామ పరి పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సిఫార్సు చేసింది. బల్వంత రాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ, తన నివేదికను 1957, నవంబరు 24న జాతీయాభివృద్ధి మండలికి సమర్పించింది. కమిటీ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958, జనవరిలో ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల అమలు వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థఏర్పాటుకు ప్రయత్నించాయి. భారతదేశంలో 1959 అక్టోబరు 2న రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను లాంచనంగా ప్రారంభించారు.

సమస్యలను స్థానికంగా పరిష్కరించడం
రాజస్థాన్ రాష్ట్రంలో, నాగోర్ జిల్లాలోని, సికార్ అనే ప్రాంతంలో ఈ విధానాన్ని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభిస్తూ చేసిన వ్యాఖ్యానం నేడు ప్రారం భమవుతున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజా స్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి. మూడు అంచెల విధానాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959, నవంబరు 1న ఆంధ్ర ప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్వద్ద నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ప్రారంభించారు. బల్వంతరాయ్ మెహతా కమిటీ చేసిన ముఖ్యమైన సిఫా ర్సులు దేశంలో 3 అంచెల పంచాయతీ రాజ్ విధానం ఏర్పాటు చేయాలి.1) జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, 2) బ్లాకు స్థాయిలో పంచాయతీ సమితి, 3) గ్రామ స్థాయిలో గ్రామపంచాయతీ ప్రజల భాగస్వామ్యం కల్పించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కాకుండా, స్వతంత్ర ప్రాతిపదికపై జర పాలి. స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమ బద్ధంగా ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థలకు తగిన అధికారాలను, ఆర్థిక వనరులను సమకూర్చాలి. భవి ష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానికసంస్థల ద్వారానే నిర్వహించాలి. స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టరు కీలకపాత్ర పోషించాలి. కిందిస్థాయిలో మినహాయించి, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. అధికారాల, పరిపాలనా, వనరులు, ప్రణాళికా, ప్రజా స్వామ్య వికేంద్రీకరణలు జరగాలి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచించింది. స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడం, ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయ డం పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం స్వాతంత్ర్యానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు తనవంతు కృషి చేస్తూనే ఉన్నాయి.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: